సినిమా షూటింగ్స్ జరిగేటప్పుడు దర్శకనిర్మాతలకు, హీరో హీరోయిన్లకు మధ్య విభేదాలు వచ్చాయంటూ అప్పుడప్పుడు వింటుంటాం. కొన్నిసార్లు ఆ విభేదాలు కాస్త.. నటీనటులను సినిమాలో నుండి తీసేసే పరిస్థితి కూడా రావచ్చు. అలా షూటింగ్ జరిగే టైమ్ లో.. సినిమా అనౌన్స్ అయ్యాక.. ఇంకా ఏవో కారణాల వలన యాక్టర్స్ ని తీసేయడం అరుదుగా జరుగుతుంది. లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ విషయంలో హీరోయిన్ కీర్తి సురేష్ కి 'దసరా' సినిమా నుండి తీసేసే పరిస్థితి వచ్చిందట. ఆ విషయాన్నీ స్వయంగా హీరోనే చెప్పడం గమనార్హం.
సాధారణంగా సినిమా షూటింగ్స్ జరిగేటప్పుడు దర్శకనిర్మాతలకు, హీరో హీరోయిన్లకు మధ్య విభేదాలు వచ్చాయంటూ అప్పుడప్పుడు వింటుంటాం. కొన్నిసార్లు ఆ విభేదాలు కాస్త.. నటీనటులను సినిమాలో నుండి తీసేసే పరిస్థితి కూడా రావచ్చు. అలా షూటింగ్ జరిగే టైమ్ లో.. సినిమా అనౌన్స్ అయ్యాక.. ఇంకా ఏవో కారణాల వలన యాక్టర్స్ ని తీసేయడం అరుదుగా జరుగుతుంది. ఈ విషయం స్వయంగా మూవీ టీమ్ గాని, సదరు యాక్టర్స్ గాని చెప్పేవరకూ బయటికి తెలియదు. అయితే.. లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ విషయంలో హీరోయిన్ కీర్తి సురేష్ కి సినిమా నుండి తీసేసే పరిస్థితి వచ్చిందట. ఆ విషయాన్నీ స్వయంగా హీరోనే చెప్పడం గమనార్హం.
నేచురల్ స్టార్ నాని, కీర్తిసురేష్ జంటగా డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సినిమా ‘దసరా’. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో.. ఐదు భాషలలో మార్చి 30న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే దసరాకి సంబంధించి సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఓవైపు కామన్ ఆడియెన్స్ తో పాటు నాని ఫ్యాన్స్, కీర్తి ఫ్యాన్స్.. దసరా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రెజెంట్ నాని, కీర్తిలతో పాటు మూవీ టీమ్ అంతా దేశవ్యాప్తంగా దసరా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ ట్రైలర్, సాంగ్స్.. ట్రెండ్ అవుతూ.. దసరాకి కావాల్సినంత బజ్ కూడా క్రియేట్ చేశాయి.
ఈ క్రమంలో దసరా నుండి హీరోయిన్ కీర్తి సురేష్ ని తీసేయాలని డైరెక్టర్ శ్రీకాంత్ అనుకున్నాడని చెప్పి.. షాకిచ్చాడు నాని. ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.. “దసరా కథను ముందుగా కీర్తి సురేష్ కు చెప్పాడు శ్రీకాంత్. ఆ టైంలో ఆమెను దాదాపు 10-12 కిలోల బరువు పెరగాలని, కాస్త బొద్దుగా కనిపించాలని సూచించాడు. దాంతో కీర్తి చూద్దాంలే అని బరువు పెరగలేదు. అప్పుడు శ్రీకాంత్ నా దగ్గరకు వచ్చి.. అన్నా మూవీ నుండి కీర్తిని తీసేద్దాం అన్నాడు. ఒక్కసారిగా నేను షాకయ్యా. నువ్వు డెబ్యూ డైరెక్టర్. ఆమె నేషనల్ అవార్డ్ విన్నర్. ఇది జరగదని చెప్పాను. ఆ తర్వాత సినిమా కీర్తితోనే చేశాడు శ్రీకాంత్. ఇక షూటింగ్ టైంలో వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు” అని చెప్పాడు.
ఈ విషయం విన్నాక.. అదే ఇంటర్వ్యూలో పక్కనే ఉన్న కీర్తి మాట్లాడుతూ.. “ఇప్పుడిప్పుడే సన్నగా అయ్యాను. 2-3 కిలోలు పెరగమంటే ఓకే. కానీ.. ఏకంగా 10-12 కిలోలు పెరగాలంటే ఎలా?” అని నవ్వేసింది. ప్రస్తుతం దసరా హీరోయిన్ వెనుక ఇంత కథ జరిగిందా అని కీర్తి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలోని గోదావరిఖని ఏరియాలో.. ఓ పల్లెటూరు చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమా కోసం దాదాపు 22 ఎకరాలలో విలేజ్ సెట్ వేశారు. పూర్తిగా మాస్ రఫ్ లుక్ లో నాని కనిపించనున్నాడు. సంతోష్ నారాయణన్ సాంగ్స్, సత్యన్ సూర్యన్ కెమెరా వర్క్.. విజువల్స్ లో ఇంటెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఈ దసరా సినిమాని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. దసరా సినిమాపై మీ అంచనాలు, అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.