ఓటీటీల వినియోగం బాగా పెరిగిన తర్వాత ఇతర భాషల్లో సినిమాలు చూస్తున్నాం. అందులో ఎవరైనా మంచిగా నటిస్తే వాళ్లకు ఫిదా అయిపోతున్నాం. వాళ్లు తెలుగులో చేశారా లేదా అనే సంగతి పక్కనబెట్టి మరీ అమితంగా ఇష్టపడుతున్నాం. ఇలా తెలుగు వాళ్లలో పలువురికి తెలిసిన నటుడు హరీశ్ కల్యాణ్. తమిళంలో హీరోగా పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఇతడు.. తెలుగులోనూ ‘జెర్సీ’ మూవీలో కీలకపాత్ర చేశాడు. ఇప్పుడు తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళ హీరో హరీష్ కల్యాణ్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని తనకు కాబోయే సతీమణిని పరిచయం చేశాడు. ‘నటుడిగా నా కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి మీరు నన్నెంతో సపోర్ట్ చేశారు. నాపై ప్రేమాభిమానాలు చూపించి ఈ స్థాయికి చేరుకునేలా చేశారు. ఇప్పుడు నా జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నాను. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. నర్మదా ఉదయ్ కుమార్ తో త్వరలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెడుతున్నాను. మా జంటకు మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను’ అని హరీశ్ కల్యాణ్ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఫొటోలు పోస్ట్ చేశాడు.
With all my heart, for all my life ❤️
Im extremely happy to introduce 𝐍𝐚𝐫𝐦𝐚𝐝𝐚 𝐔𝐝𝐚𝐲𝐚𝐤𝐮𝐦𝐚𝐫, my wife-to-be. Love you to bits 🤗❤️
With God’s blessings, as we begin our forever, we seek double the love from you all, now & always pic.twitter.com/yNeHusULfY
— Harish Kalyan (@iamharishkalyan) October 5, 2022
తమిళ ‘బిగ్ బాస్ 1’తో ప్రేక్షకులకు పరిచయమైన హరీశ్ కల్యాణ్.. ‘సింధు సమవేలి’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. ఇందులో యాక్టింగ్ కి మనోడికి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆ తర్వాత ‘ప్యార్ ప్రేమ కాదల్’, ‘ఇస్పడే రాజవుం ఇదయ రాణియుం’ చిత్రాలు మనోడికి బాగా గుర్తింపు తీసుకొచ్చాయి. తెలుగులో తెరకెక్కిన ‘కాదలి’లో హరీశ్ హీరోగా నటించాడు. నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ’లో యంగ్ నాని లుక్ లోనూ నటించి మెప్పించారు. ప్రస్తుతం స్టార్, డీజిల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో అవి విడుదల కానున్నాయి. మరి హరీశ్ కల్యాణ్ పెళ్లికి రెడీ కావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.