తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోలు, నిర్మాత, డైరెక్టర్ల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ టి.కృష్ణ తనయుడు గోపిచంద్ ‘తొలివలపు’ చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తాజాగా గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. కామెడీ చిత్రాలకు పెట్టింది పేరు అయిన మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2– యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించారు.
తెలుగు బుల్లితెరపై వరుసగా ప్రమోషన్ బిజీలో ఉన్నాడు హీరో గోపీచంద్, మారుతి. తాజాగా క్యాష్ ప్రోగ్రామ్ లో ఈ ఇద్దరు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఓ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ క్యాష్ ప్రోగ్రామ్ లో బన్ని వాసు, శ్రీనివాస్ తో కలిసి గోపీచంద్, మారుతి నవ్వులు పూయించారు. సుమ గిఫ్ట్ లు ఇస్తు కమర్షియల్ అంటూ డబ్బులు డిమాండ్ చేయడంతో గిఫ్ట్‌లని చెప్పి మరీ డబ్బులు అడుగుతున్నారంటూ గోపీచంద్ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత గెస్టులతో పలు గేమ్స్ ఆడించారు యాంకర్ సుమ.
ఈ ప్రోమో ఎండింగ్ లో గోపీ చంద్ తండ్రి ప్రముఖ దర్శకులు టి. కృష్ణ ఫోటో చూపించారు. ఆ ఫోటో చూసి హీరో గోపీచంద్ ఒకంత ఎమోషన్ కి గురయ్యారు. ‘నా చిన్నతనంలో అంటే దాదాపు నేను తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. చిన్నప్పుడే జీవితం చాలా నేర్పించింది.. నాకు ఇప్పుడు తెలుస్తోంది ఏం కోల్పోయానో.. మా నాన్నతో ఎక్కువ సమయం గడపలేకపోయా..’అంటూ ఎమోషనల్ అయ్యారు. దాంతో అక్కడ ఉన్న యాంకర్ సుమతో సహా అందరూ బాధపడ్డారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.