Salman Khan: సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు ఎప్పుడైనా సినీ ఈవెంట్ లో గాని, అవార్డ్స్ ఫంక్షన్ లో గాని ఎదురుపడితే.. ఫన్నీ కామెంట్స్ చేసుకోవడం అనేది కామన్. కానీ.. స్టార్ హీరోలపై యంగ్ హీరోయిన్స్ సెటైర్స్ వేస్తే మాత్రం.. ఖచ్చితంగా రియాక్షన్ ఊహించని విధంగానే ఉంటుంది. కాకపోతే అది పాజిటివ్ లేదా నెగటివ్ ఏదైనా అయ్యుండొచ్చు. ఒక్కోసారి నెగటివ్ అయితే.. ఆ హీరో పక్కన సినిమా ఛాన్స్ కోల్పోవచ్చు. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అలీఖాన్ కి అంతటి పనే అయ్యింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ని అంకుల్ అని పిలిచి తనతో నటించే ఛాన్స్ పోగొట్టుకుంది. ఈ విషయాన్ని కూడా స్వయంగా సల్మాన్ నోటి నుండే రావడం గమనార్హం. అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఐఫా-2022 అవార్డ్స్ వేడుక అబుదాబిలో జరిగింది. స్టేజిపై సల్మాన్ తో సారా మాట్లాడుతూ.. అందరిముందే స్టేజిపై 'సల్మాన్ అంకుల్' అనేసింది. అంతే అందరూ నవ్వేశారు. దీంతో సల్మాన్ కి కోపం వచ్చి.. "నువ్వు నా సరసన నటించే అవకాశం త్వరలో వచ్చేదేమో.. ఇప్పుడు అంకుల్ అని పిలిచావ్ కదా.. ఆ సినిమా ఛాన్స్ లేదు నీకు" అనేశాడు. సల్మాన్ మాటలకు ఖంగుతిన్న సారా.. 'మీరే కదా అంకుల్ అని పిలవమన్నారు' అంది. వెంటనే కూల్ అయిపోయిన సల్మాన్.. సారాతో డాన్స్ చేశాడు. ప్రస్తుతం సల్మాన్ - సారాల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv)