దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం RRR. ఈ సారి ఆస్కార్ బరిలో కచ్చితంగా ఉంటుంది అనుకున్నారు సినీ అభిమానులు అంతా. ఇక ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసిన సంగతి మనందరికి తెలిసిందే. రాజమౌళి టేకింగ్.. NTR, రామ్ చరణ్ నటన, విజువల్ ఎఫెక్స్ట్ అన్నీ ఓ రేంజ్ లో ఉన్నాయి. దాంతో సగటు ప్రేక్షకుడు సైతం ఈ సారి భారతదేశం తరపున ఆస్కార్ బరిలో గ్యారంటీగా RRR మూవీ ఉంటుందని అందరూ భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. గుజరాతీ సినిమా అయిన “ఛెల్లో షో” (Chhello Show)భారతదేశం తరపున అధికారికంగా ఆస్కార్ బరిలోకి దిగనుంది. ఈవార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
RRR.. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించింది. ఈ క్రమంలోనే ఈ మూవీపై హాలీవుడ్ రైటర్స్, డైరెక్టర్స్ కూడా ప్రశంసల వర్షం కురింపిచారు. దాంతో ఈ చిత్రం ఆస్కార్ బరిలో భారతదేశం తరపున నిలబడుతుందని భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. నేషనల్ ఫిల్మ్ ఫెడరేషన్ గుజరాతీ మూవీ అయిన “ఛెల్లో షో” ను ఆస్కార్ బరిలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను పాన్ నలిన్ అనే దర్శకుడు తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాను గుజరాత్ లో, దేశంలో ఎన్నుకోబడిన థియేటర్లలో అక్టోబర్ 14 న ప్రదర్శించనున్నారు. దీంతో NTR, రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురైయ్యారు.
ఛెల్లో షో కథలోకి వెళ్తే.. గ్రామీణ నేపథ్యంలో ఓ కుర్రాడు తన కలను నెరవేర్చుకోడానికి ఎంత కష్ట పడ్డాడు అనే ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కింది. తన సినిమా ఆస్కార్ బరిలో నిలవడంతో డైరెక్టర్ ట్వీటర్ లో ఇలా రాసుకొచ్చాడు..”ఓ మై గాడ్.. ఇదోక మర్చిపోలేని రాత్రి. థ్యాక్యూ భారత చలన చిత్ర మండలికి నా ధన్యవాదాలు. మీరు నా చిత్రాన్ని నమ్మినందుకు.. అలాగే మీరు చిన్న చిత్రాలకు ప్రాణం పోశారు” అంటూ రాసుకోచ్చాడు. ఈ కథ తన చిన్ననాటి అనుభవాల నుంచే పుట్టింది అని డైరెక్టర్ పాల్ నలిన్ చెప్పాడు. మరి ఆస్కార్ బరిలో నిలిచిన ఛెల్లో షో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
OMG! What a night this going to be! Gratitude to Film Federation of India and thank you FFI jury members. Thank you for believing in Chhello Show. Now I can breathe again and believe in cinema that entertains, inspires and enlightens! @LastFilmShow1 #ChhelloShow #Oscars
— Nalin Pan (@PanNalin) September 20, 2022