ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మంచి కంటే చెడు పనులకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు జనాలు. గతంలో సోషల్ మీడియా లేనేప్పుడు సినీ సెలబ్రిటీలు ఇలాంటి ఇబ్బందులు పడ్డారో లేదో లేక సమాచారం బయటికి రాలేదో తెలియదు. కానీ.. ఇప్పుడైతే హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులకు సంబంధించి అశ్లీల వీడియోలు లీక్ చేయడం లేదా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో, సైట్స్ లో వీడియోలు వైరల్ చేయడం జరుగుతుండటం చూస్తున్నాం. ఈ క్రమంలో భోజ్‌పురి యువనటి అక్షరా సింగ్ కి సంబంధించి లీకెడ్ వీడియో అంటూ ఓ ఎంఎంఎస్ వైరల్ అయ్యింది.
ఆ వీడియో కారణంగా అక్షరా సింగ్ పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కి గురైంది. ఆ అశ్లీల వీడియోలో ఉంది అక్షరా సింగే అంటూ జోరుగా ప్రచారం సాగి.. విషయం ఆమె చెవిలో పడింది. దీంతో ఈ లీకైన ఎంఎంఎస్ వీడియో ఇష్యూపై అక్షరా సింగ్ స్పందించింది. ఈ సందర్భంగా అక్షరా మాట్లాడుతూ.. “ఈ పని ఎవరు చేసారో తెలియదు. కానీ.. నేను ఇలాంటి విషయాలను అసలు పట్టించుకోను. నేను ఆ వీడియో చూడలేదు. ఆ వీడియోలో నేను ఉన్నానా లేదా అనే కామెంట్స్ చూసి ఏడ్చే ఉద్దేశం కూడా లేదు” అంటూ ఖరాఖండీగా చెప్పేసింది. అనంతరం అక్షర తరపున అధికార ప్రతినిధి రంజన్ సిన్హా ఆ వీడియో ఇష్యూపై మాట్లాడారు. రంజన్ సిన్హా స్పందిస్తూ.. ఇదంతా నటి అక్షర పరువు తీసేందుకు కుట్ర అని మండిపడ్డారు.
అక్షర ఎంతో కష్టపడి పాపులర్ అయ్యింది. ఆ కారణంగానే అక్షరా పరువు తీయాలని కుట్ర పూనారని అన్నారు. సోషల్ మీడియాలో అక్షర వీడియోలను తీసుకొని ఎంఎంఎస్ కి లింక్ చేశారని రంజన్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు ఫేక్ వీడియోలు, వార్తలను విచారణ చేయకుండా ప్రసారం చేయవద్దని ఆయన కోరారు. ఇదిలా ఉండగా.. గతేడాది బిగ్ బాస్ ఓటిటి షోలో అక్షరా కంటెస్టెంట్ గా కూడా పాల్గొంది. అలాగే ‘కాలా టీకా’, ‘సర్వీస్ వాలీ బహు’ వంటి సీరియల్స్ లో నటించింది. ఇక భోజ్ పురిలో ‘సౌగంధ్ గంగా మైయా కీ’, ‘సత్య’, ‘ధడ్కన్’, ‘మా తుజే సలామ్’ లాంటి సినిమాలలో ఆకట్టుకుంది. మరి అక్షరా సింగ్ ఎంఎంఎస్ వీడియో లీక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.