Manchu Manoj And Bhuma Mounika: మంచు వారి చిన్నబ్బాయి మనోజ్.. భూమా వారి చిన్నమ్మాయి మౌనిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్న సీతాఫల్‌మండిలోని ఓ గణేష్ మండపాన్ని ఇద్దరూ జంటగా దర్శించుకున్నారు. ఇక,అప్పటినుంచి వీరిద్దరూ పెళ్లి పీఠలెక్కబోతున్నరంటూ వార్తలు రావటం మొదలైంది. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లిపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇద్దరి బంధంపై ఆయన కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
ప్రకాశ్ రావ్ మాట్లాడుతూ.. ‘‘వాళ్ల రెండు కుటుంబాలకు మొదటినుంచి సంబంధం ఉంది. మౌనికకు మంచు ఫ్యామిలీతో మంచి సంబంధం ఉండింది. మనోజ్‌తో మంచి స్నేహం ఉండింది. వాళ్లు ఒక స్టేజిలో పెళ్లి వరకు పోయారు. భూమా నాగిరెడ్డి, శోభానాగి రెడ్డి దాన్ని వ్యతిరేకించారు. తర్వాత ఇప్పుడు ఒక కుమారుడు పుట్టి, డైవర్స్ అయ్యాక మౌనిక, మనోజ్ సహజీవనం చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఈ రోజు మీడియాలో రావచ్చు. రెండు కుటుంబాలకు.. కొన్ని లక్షల మందికి తెలుసు. కర్నూలు ప్రాంతంలో కానీ, ఆళ్లగడ్డ ప్రాంతంలో కానీ, హైదరాబాద్‌లో కానీ, సినిమా ఫీల్డ్‌లో.. వాళ్లు ఒకటే అని తెలుసు.
మొన్నటి వరకు మద్రాస్‌లో ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చారు. మంచు మనోజ్ తల్లిదండ్రులను ఒప్పించాడు. అఫియల్‌గా మంచి రోజులు చూసుకుని పెళ్లి చేసుకోబోతున్నారనుకుంటున్నాను. అందులో ఏమాత్రం అనుమానం లేదు. మొదటి మ్యారేజ్ అధికారికంగా విడాకులయ్యాయి. ఏమైందో తెలియదు కానీ, రెండేళ్లనుంచి వాళ్లకు సంబంధాలు లేవు. కొడుకు పుట్టిన తర్వాత మౌనిక భర్తతో విడిపోయింది’’ అని చెప్పుకొచ్చారు. మరి, మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లిపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రశాశ్ రావు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Salman Khan: సల్మాన్ ఖాన్ హత్యకు స్కెచ్.. సల్మాన్ ఇంటి వద్ద రెక్కీ!