ఘట్టమనేని కృష్ణ.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పేరంటూ తెలియని వారుండరు. అదీ కాక ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి మంచి పేరుంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ నుంచి నట వారసత్వాన్ని తీసుకున్న హీరో మహేశ్ బాబు తెలుగు లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న సంగతి మనందరికి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలోనే మహేశ్ బాబు తల్లిగారైన ఇందిరా దేవి కాలం చేసిన విషయం మనందరికి తెలిసిందే. అయితే దాదాపు ఘట్టమనేని కుటుంబానికి చెందిన ఫొటోలు సోషల్ మీడియాలో మనకు ఎక్కువగా కనిపించవు. కానీ తాజాగా మహేశ్ బాబు మేనకోడలు.. మంజుల కుతురు జాహ్నవి స్వరూప్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఘట్టమనేని మంజుల.. హీరో మహేశ్ బాబు సోదరిగా సుపరిచితురాలే. అదీకాక ఆమె గతంలో తెలుగులో పలు చిత్రాల్లో నటించిన సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. ఆమె భర్త సంజయ్ స్వరూప్ సైతం ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. మంజుల కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. గతంలో “షో” అనే సినిమాలో నటించి జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకున్నారు. తరువాత క్రమంగా సినిమాలకు దూరం అయ్యారు. ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు చేస్తూ.. అభిమానులను పలకరిస్తోంది. కొన్ని రోజుల క్రీతం తన తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ హోం టూర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ నేపథ్యంలోనే మంజుల సోషల్ మీడియాలో యాక్టీవ్ అయినప్పటికీ.. తన ఫ్యామిలీ కి సంబంధించిన పిక్స్ మాత్రం చాలా తక్కువగా పోస్ట్ చేస్తుంది. తాజాగా తన కూతురుతో దిగిన ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. మంజుల కూతురు పేరు జాహ్నవి స్వరూప్.. తను మామయ్య సూపర్ స్టార్ అయినప్పటికీ ఈ అమ్మాయి మాత్రం మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అయితే మహేశ్ బాబు కూతురు సితారా, కొడుకు గౌతమ్ లు సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో మనకు తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే మహేశ్ మేనకోడలి ఫొటో చూసిన అభిమానులు”కుందనపు బొమ్మలా ఉంది” అంటే మరికొందరు హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోదు అంటూ రాసుకొచ్చారు.