తమిళ సీరియల్ నటీ,నటులు అర్నవ్-దివ్య దంపతుల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పుడీ వివాదంలో ఓ కొత్త మలుపు చోటుచేసుకుంది. తనపై ఆరోపణలు చేస్తున్న తన భార్య దివ్య మతిస్థిమితం సరిగా లేదని భర్త అర్నవ్ అంటున్నాడు. అందుకారణంగానే గొడవకు దిగుతోందని అన్నాడు. దివ్య ఆరోగ్య పరిస్థితి తెలియజేసే డాక్టర్ సర్టిఫికేట్‌తో పాటు ఓ ప్రైవేట్ వీడియోను కూడా విడుదల చేశాడు. అది అర్నవ్ తీసిన వీడియో.. ఆ వీడియోలో.. ‘‘ నువ్వు వీడియో తీస్తే నేను భయపడను. ఏం చేస్తావ్.. ఏం చేస్తావ్. నువ్వు ఏది చేసినా నీకు దొరికేది ఇదే… నువ్వు ఒక మగాడివా?’’ అని దివ్య.. అర్నవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేయగా.. అర్నవ్ వెంటనే ‘‘ నీ భర్తకు.. నీ పిల్లాడికి..’’ అని అన్నాడు. దీంతో దివ్య మరింత కోపంగా ‘‘ వద్దు.. వద్దు ముద్దు.. ఊరికే ఉండు.. నువ్వు కరెక్ట్ అని నిరూపించుకోవటానికి తప్పు మీద తప్పు చేయోద్దు’’ అని హెచ్చరించింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు! దివ్య చనిపోతానంటూ బెదిరిస్తోందని ఆమె రాసిందంటూ అర్నవ్ ఓ సూసైడ్ నోట్‌ను వీడియోలో చూపించాడు. అయితే, దివ్య మానసిక స్థితి సరిగా లేకపోతే ఆమె ఎలా గర్భవతి అయిందని దివ్య తరపు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. మానసిక స్థితి సరిగా లేని ఆమెపై అర్నవ్ అత్యాచారానికి పాల్పడ్డాడా అని నిలదీస్తున్నారు. కాగా, అర్నవ్ తనను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడని, తనను గర్భవతిని చేసిన తర్వాత మరో నటితో ఎఫైర్ సాగిస్తున్నాడని ఆరోపిస్తూ దివ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు, తన కడుపలోని బిడ్డకు అర్నవ్ నుంచి ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొంది.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అర్నవ్‌తో తనకు 2017లో ఓ సీరియల్ షూటింగ్‌లో పరిచయం అయిందని తెలిసింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారిందని పేర్కొంది. దాదాపు 5 సంవత్సరాలు ప్రేమలో ఉన్నామని వెల్లడించింది. గత జూన్ 29న పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. తాను గర్భం దాల్చిన తర్వాత అర్నవ్ దూరం పెడుతూ వస్తున్నాడని వాపోయింది. వేరే సీరియల్ నటితో ఎఫైర్ సాగిస్తున్నాడని ఆరోపించింది. తన భర్త, ఆ నటి షూటింగ్‌లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్లానని, ఇద్దరూ ఒకే రూములో ఉన్నారని తెలిపింది. ఇద్దరినీ నిలదీయగా.. సదరు నటి తనను కొట్టిందని, తన ముందే అర్నవ్‌కు ముద్దు కూడా పెట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది.