యూట్యూబ్ లో వీడియోల ద్వారా తనదైన కామెడీ పండిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది గంగవ్వ. అచ్చమైన పల్లెటూరి ముసలవ్వ పాత్రల్లో నటిస్తూ.. తన యాసతో అందరి మనసు దోచుకుంది. ఇక తెలుగు బుల్లితెరపై వచ్చిన బిగ్ బాస్ సీజన్ 4 లో తెలుగు రాష్ట్ర ప్రజలకు మరింత దగ్గరైంది. స్వచ్ఛమైన తెలంగాణ యాసలో అందరినీ పలకరించే గంగవ్వ ఇప్పుడు సెలబ్రిటీ స్థాయిలో పేరు తెచ్చేసుకుంటోంది. ఈ మద్య గంగవ్వ బుల్లితెరపైనే కాదు వెండి తెరపై కూడా తన సత్తా చాటుతూ వస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే.. గంగవ్వను ఫిలిం మేకర్స్ ఒకరకంగా సెంటిమెంట్ గానూ ఫీలవుతున్నారు.
ఇదీ చదవండి : కొడుకుపై షారూఖ్ ఖాన్ సంచలన కామెంట్.. వీడియో వైరల్!
నాగార్జున తనను ప్రత్యేకంగా ప్రమోట్ చేయడం సోషల్ మీడియాలో బాగా కలిసొచ్చింది. ఇటీవల గంగవ్వ నటించి మల్లేశం కమర్షియల్ గా ఆడకపోయినా మంచి పేరు తెచ్చుకుని క్లాసిక్ గా మిగిలిపోయింది. రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’సూపర్ హిట్ అయ్యింది. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’,‘రాజరాజ చోర’రిజల్ట్ కూడా నాట్ బ్యాడ్ అనిపించుకుంది. అంతే కాదు చైతూ,సాయి పల్లవి నటించిన బస్టర్ ‘లవ్ స్టోరీ’లోనూ గంగవ్వ మెరిసింది. తాజాగా గంగవ్వకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఆచార్య చిత్రం చేస్తున్న చిరంజీవి రీసెంట్‌గా గాడ్ ఫాదర్ చిత్ర షూటింగ్ కూడా మొదలు పెట్టాడు.
మాలీవుడ్ లో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కి ఇది రిమేక్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఊటీ లో జరుగుతుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, మోహన్ రాజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో చిరుకి తల్లిగా గంగవ్వ నటిస్తున్నట్లు ఫిటిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. వాస్తవానికి ఒరిజినల్ మూవీలో ఈ సెంటిమెంట్ లేదు.. కానీ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ మూవీ తీయబోతున్నారని.. అందుకే ఈ పాత్ర క్రియేట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ తల్లిగా నటించే వార్త నిజమైతే గంగవ్వ దశ దిరిగినట్టే అంటున్నారు మెగా అభిమానులు. కాగా, ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లెలిగా నటించనున్న విషయం తెలిసిందే.