నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ‘వీరసింహారెడ్డి’. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రాబోయే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ ‘జై బాలయ్య’ విశేషదారణ దక్కించుకుంది. కాగా.. సంక్రాంతికి ఇంకా కొద్దిరోజుల సమయమే ఉండటంతో.. సినిమా షూటింగ్ ని రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ క్రమంలో వీరసింహారెడ్డి మూవీకి సంబంధించి ఓ పిక్ వైరల్ అవుతోంది. షూటింగ్ లొకేషన్ లో బాలయ్యతో కలిసి ఓ వ్యక్తి దిగిన పిక్ ప్రస్తుతం ఫ్యాన్స్ లో చర్చనీయాంశంగా మారింది. వేషధారణ చూస్తుంటే పంతులు లాగా కనిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరా అని బాలయ్య ఫ్యాన్స్ ఆరా తీయడం మొదలు పెట్టారు. కాగా.. ఆ వ్యక్తి పేరు ఎస్. ఆర్. ఎస్. ప్రసాద్. ఆయన ప్రొద్దుటూరుకి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ అని తెలుస్తోంది. అయితే.. ఆర్ఎస్ఎన్ ప్రసాద్.. బాలయ్యకి వీరాభిమాని. అంతేగాక ఈ వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య పక్కన ఓ పాత్రలో కూడా నటించాడట. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నుండి వెళ్లి బాలయ్య పక్కన ఏకంగా సినిమాలో నటించినందుకు ప్రసాద్ కి.. ప్రొద్దుటూరు బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్. ఎం. షరీష్ ఫ్యాన్స్ తరపున అభినందనలు తెలిపారు.
ప్రస్తుతం బాలయ్యతో కలిసున్న ఆర్ఎస్ఎన్ ప్రసాద్ పిక్ నెట్టింట ట్రెండ్ అవుతుండగా.. నందమూరి ఫ్యాన్స్ ఆ పిక్ ని షేర్ చేస్తున్నారు. అలాగే ఫోటోని గమనిస్తే.. వైట్ అండ్ వైట్ లో బాలయ్య ఫైట్ షూట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. పిక్ లో బాలయ్య ముఖంపై గాయం మరకలు కూడా ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 8 నుండి బాలయ్య – శృతిహాసన్ లపై సాంగ్ షూట్ చేయనున్నారు మేకర్స్. ఇక వీరసింహారెడ్డి సినిమా తర్వాత బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దీంతో పాటు త్వరలో బోయపాటి కాంబినేషన్ లో ‘అఖండ 2’ మూవీ చేయనున్నట్లు రీసెంట్ గా గోవా ఫిలిం ఫెస్టివల్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
— S.M.SHAREER (@mahaboob75) November 28, 2022