కొత్త దర్శకులు ఎవరైనా సరే.. తమ డెబ్యూ సినిమాలతో దాదాపు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. సబ్జెక్టుకు అనుగుణంగా నటీనటుల నుండి ప్రతి సన్నివేశానికి పూర్తిస్థాయిలో నటనను రాబట్టుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'దసరా' మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. అలాంటి అసంతృప్తినే ఫేస్ చేస్తున్నారట.
చిత్రపరిశ్రమలో కొత్త దర్శకులు ఎవరైనా సరే.. తమ డెబ్యూ సినిమాలతో దాదాపు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. అందుకోసం వారు ఎంచుకున్న సబ్జెక్టుకు అనుగుణంగా నటీనటుల నుండి ప్రతి సన్నివేశానికి పూర్తిస్థాయిలో నటనను రాబట్టుకోవాలని ఆరాటపడుతుంటారు. అయితే.. స్క్రిప్ట్ ఓకే అయ్యాక.. షూటింగ్ మధ్యలో ఎవరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సులు వచ్చినా.. ఆ సినిమాలో లేదా దర్శకుడిలో ఏదొక అసంతృప్తి కనిపిస్తుంది. క్రియేటివ్ డిఫరెన్స్ లు కూడా దర్శకుడికి.. టెక్నికల్ టీమ్ కి మధ్య వస్తే పరవాలేదు. ఒకరిని కాకపోతే ఇంకొకరితో అయినా సినిమాని కంప్లీట్ చేసేందుకు ట్రై చేస్తారు.
అదే క్రియేటివ్ డిఫరెన్స్ లేదా పొరపొచ్చాలు హీరోకి, దర్శకుడికి మధ్య వస్తే.. అదికూడా సినిమా షూట్ దాదాపు పూర్తయ్యాక ఏర్పడితే పక్కాగా దర్శకుడిలో ఎక్కడో సినిమా రిజల్ట్ పై సందేహాలు మొదలవుతాయి. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘దసరా’ మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. అలాంటి అసంతృప్తినే ఫేస్ చేస్తున్నారట. అందుకు కారణాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. దసరా సినిమా మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ప్రారంభించేసారు మేకర్స్. ఇప్పటిదాకా సినిమా నుండి విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
ఇలాంటి తరుణంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. హీరో నాని విషయంలో డిజప్పాయింట్ అయ్యాడని టాక్. అందుకు కారణం.. సినిమా షూటింగ్ పూర్తయ్యాక.. కొన్ని పోర్షన్స్ రీషూట్ చేసేందుకు డైరెక్టర్ శ్రీకాంత్.. నానిని ఇంకో పది రోజులు ఎక్స్ ట్రా డేట్స్ అడిగాడట. దానికి నాని నిరాకరించాడని.. అందుకే దర్శకుడు నాని విషయంలో నిరాశ చెందాడని సినీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు నాని మాత్రం.. దర్శకుడిగా శ్రీకాంత్ ని, దసరా సబ్జెక్టుని నెక్స్ట్ లెవెల్ లో ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. చూడాలి ఈ విషయంపై రిలీజ్ లోపు క్లారిటీ రానుందేమో! ఇక పీరియాడిక్ విలేజ్ యాక్షన్ మూవీలో హీరోయిన్ గా కీర్తిసురేష్ నటించింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. మరి దసరాపై మీ అభిప్రాయాలను, అంచనాలను కామెంట్స్ లో తెలపండి.
DHARANI 🔥😍
HD still of @NameisNani from #Dasara #DasaraOnMarch30th 💥#Nani pic.twitter.com/hCkvvEXlGt— Nani Fans Association (@nfa_hyd) February 17, 2023