ఐశ్వర్య రాయ్.. అందానికి నిలువెత్తు నిదర్శనం. వయసుతో పాటు అందం తరుగుతుంది. కానీ ఐశ్వర్య విషయంలో మాత్రం అది రివర్స్ అవుతుంది. వయసు పెరిగిన కొద్ది.. మరింత అందంగా మెరిసిపోతుంది.. ఈ విశ్వ సుందరి. బిడ్డ ఆరాధ్య పుట్టిన తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొన్నాళ్లకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ కెరీర్ పెళ్లికి ముందులా సక్సెస్‌ఫుల్‌గా లేదు. ఈ క్రమంలో తాజాగా ఐశ్వర్య.. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఐశ్వర్య తమ సినిమాలో నటిస్తే చాలు అనేకునే దర్శకులు నేటికి ఎందరో ఉన్నారు. అలాంటిది.. ఆమెకు వార్నింగ్ ఇచ్చేంత సాహసం ఎవరు చేయలేరు. కానీ దర్శకుడు మణిరత్నం మాత్రం.. ఐశ్వర్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడంట. అది కూడా ఓ హీరోయిన్‌తో మాట్లాడవద్దని. ఇంతకు ఎవరా హీరోయిన్.. మణిరత్నం ఎందుకు ఇలా వార్నింగ్ ఇచ్చాడు అంటే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమొగుతున్న పేరు.. పొన్నియన్ సెల్వన్. భారీ బడ్జెట్, తారాగణంతో తెరకెక్కింది ఈ చిత్రం. సెప్టెంబర్ 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం.. ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. వరుస ప్రెస్‌మీట్లు నిర్వహిస్తూ.. ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆయన కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఫుల్ బిజీగా గడుపుతున్నారు.
ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మణిరత్నం పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పొన్నియన్ సెల్వన్ చిత్రంలో కీలక పాత్రల్లో నటించిన స్టార్ హీరోయిన్లు ఐశ్వర్యరాయ్, త్రిషల గురించి ఆసక్తికర విసయాలు వెల్లడించారు మణిరత్నం. సినిమా షూటింగ్ సందర్భంగా ఐశ్వర్యరాయ్, త్రిషలకు తాను వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. సినిమాలో భాగంగా వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ విషయంలో తాను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందన్నారు. ఆ విషయంలో తాను చాలా కష్టపడ్డానన్నారు మణిరత్నం.. ఓ సందర్భంలో వారిద్దరి మీద కోప్పాడాల్సి వచ్చిందని తెలిపారు.
పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్య రాయ్, త్రిష ఇద్దరివి సీరియస్ రోల్స్. ఇద్దరి మధ్య చాలా సీరియస్‌గా డైలాగ్స్ ఉంటాయి. అటువంటి టైమ్‌లో వీరి మధ్య ఉన్న స్నేహం కారణంగా డైలాగ్స్ చెప్పేటప్పుడు సీరియస్‌నెస్ తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చారు మణిరత్నం. దాంతో ఇక సినిమా పూర్తయ్యవరకు ఇద్దరిని మాట్లాడుకోవద్దని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారట. అయినా కూడా ఐశ్వర్యరాయ్, త్రిష కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ తీసేటప్పుడు చాలా టైం పట్టిందని చెప్పుకొచ్చారు మణిరత్నం.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరో బాహుబలి అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులు అంచనాలను ఏమేరకు అందుకుంటుందో చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.