ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ అందానికి దాసోహం అవ్వని వారు ఉండరు. ఆమె అందానికి మహామహులే దాసోహమయ్యారు. ఆమెతో కలిసి ఒక్క సినిమాలో నటిస్తే చాలనుకున్న స్టార్ హీరోలు ఎంతోమంది ఉన్నారు. మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా, అత్యంత ప్రభావితం చేసే సెలబ్రిటీగా ఆమె తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ గా మీడియా తరచూ సంబోధిస్తుంటుంది. అంత గొప్ప అందగత్తెను తెలుగు సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్ ద్వారా పరిచయం చేసిన ఘనత అక్కినేని నాగార్జునదే. రావోయి చందమామ సినిమాలో ఒక పాటకి ఆమె నర్తించారు. ఈమెను తెలుగు సినిమాల్లో నటింపజేయాలని చాలా మంది దర్శక, నిర్మాతలు, హీరోలు ప్రయత్నించారు. కానీ అవేమీ వర్కవుట్ కాలేదు.
తెలుగులో డైరెక్ట్ గా ఏ సినిమా చేయకపోయినా.. ఈ ప్రపంచ సుందరికి తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళ మూవీ ఎంథిరన్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ రోబోలో రజనీకాంత్ పక్కన కనిపించిన ఐశ్వర్య రాయ్.. చాలా కాలం పాటు సౌత్ సినిమాల్లో దర్శనమివ్వలేదు. కేవలం బాలీవుడ్ కే పరిమితమైన ఐశ్వర్య రాయ్.. పెళ్ళై, పిల్లలు పుట్టినప్పటికీ ఆమె సినిమాల్లో నటించారు. అయితే 2018 తర్వాత ఆమె పూర్తిగా సినిమాలకి దూరమయ్యారు. ఆమె రాక కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. పుష్కర కాలం తర్వాత మళ్ళీ ‘పొన్నియిన్ సెల్వన్’ అనే తమిళ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
నందిని, మందాకినీ దేవి అనే రెండు పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి ఆడియో లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఆడియో లాంఛ్ కి విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, త్రిష, మణిరత్నం సహా చాలా మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ ఆడియో లాంచ్ లో ఐశ్వర్యని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన సినిమా ట్రైలర్ లో నాజూకుగా కనిపించిన ఐశ్వర్య.. ఈ ఆడియో లాంచ్ లో బొద్దుగా కనిపిస్తున్నారు. ఆమె మొఖం కూడా డల్ గా, గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. 40+ ఏజ్ లోనూ కరీనా కపూర్, విద్యాబాలన్ లాంటి హీరోయిన్లు సినిమాల్లోనూ, బయట కూడా తమ అందాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.
కానీ 48 ఏళ్ల వయసున్న ఐశ్వర్య రాయ్ మాత్రం సినిమాలో అందంగా కనిపించినప్పటికీ.. బయట మాత్రం గుర్తుపట్టని విధంగా కనిపించేసరికి అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఐష్ మేడమ్ కి ఏమైందంటూ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. త్వరలోనే ‘పొన్నియన్ సెల్వన్’ మూవీ ఆడియో లాంచ్ సన్ టీవీలో టెలికాస్ట్ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవలే రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఐశ్వర్య రాయ్ ఇలా కనబడడంతో అభిమానులు కంగుతిన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇలా షాకింగ్ లుక్ లో కనబడుతున్న ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.