టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా ఆయా ఇండస్ట్రీల హీరోలు అన్ని భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. తమ దృష్టిలో తాము చేసిన సినిమా.. ప్రాంతీయ సినిమా కాదని, భారతీయ సినిమా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే మన తెలుగు హీరోలు ఇతర భాషా దర్శకులతోనూ, అలానే ఇతర భాషా హీరోలు మన తెలుగు దర్శకులతోనూ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ హిందీ, కన్నడ డైరెక్టర్స్‌తో, రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్‌తో, జూనియర్ ఎన్టీఆర్ కన్నడ దర్శకుడైన ప్రశాంత్ నీల్‌తో ఒక మూవీ చేస్తుడగా.. తమిళ హీరో ధనుష్ తెలుగులో యంగ్ దర్శకుడితో ఒక సినిమా చేసేందుకు రెడీ అయ్యారు.
కేరింత, తొలిప్రేమ, మిస్టర్ మజ్ఞు, రంగ్ దే సినిమాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో.. కోలీవుడ్ హీరో ధనుష్ నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తమిళంలో ఈ సినిమాకి ‘వాత్తి’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా, తెలుగులో ‘సార్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా ధనుష్‌కి ఇదే తెలుగు స్ట్రైట్ మూవీ. ఈ సినిమాలో ధనుష్ స్కూల్ మాష్టార్‌గా నటిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, డైలాగ్ కింగ్ సాయికుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‍ను ధనుష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
సార్ సినిమా ఫస్ట్ లుక్ జూలై 27న, టీజర్ 28న రిలీజ్ చేస్తున్నట్లు ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. బ్లాక్ బోర్డ్‌పై ధనుష్ చాక్‌పీస్‌తో రాస్తున్న స్టిల్‌తో వినూత్నంగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తెలుగులో తొలిసారిగా చేస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వెంకీ అట్లూరి కూడా ఈ సినిమాపై హోప్స్ పెట్టుకున్నారు. క్లాస్ లవ్ స్టోరీతో పాటు, ధనుష్ మార్క్ మాస్ అంశాలు ఉంటాయని నిర్మాతలు చెబుతున్నారు. స్కూల్ మాష్టార్‌గా తన స్కూల్‌ను, ప్రేమికుడిగా తన ప్రేమను సక్సెస్ చేసుకునే క్రమంలో హీరో ఎదుర్కున్న సమస్యల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. మరి ఈ సినిమా వెంకీ అట్లూరికి, ధనుష్‌కి ఏ రేంజ్ సక్సెస్‌నిస్తుందో చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
#Vaathi #Sir pic.twitter.com/UzrDY0Nkmx
— Dhanush (@dhanushkraja) July 25, 2022