ఈ సంక్రాంతికి టాలీవుడ్ సినిమాలు క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాకుండా ఒక ఫ్యాన్ తన అభిమాన హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అభిమాని డైరక్టర్ గా మారి సినిమా తీస్తే ఎలివేషన్స్ ఏ తరహాలో ఉంటాయనే విషయాన్ని ఇప్పటికే వార్తేరు వీరయ్య- వీర సింహారెడ్డి సినిమాల్లో చూశాం. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ ట్రెండే నడుస్తోంది. అందులో భాగంగా పవన్ కల్యాణ్– సుజీత్ కాంబోలో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.
ఇప్పుడు ఈ OG(వర్కింగ్ టైటిల్) సినిమాకి సంబంధించి టాలీవుడ్ వర్గాల్లో ఓ క్రేజీ టాక్ నడుస్తోంది. అందేటంటే ఈ సినిమా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారంట. ఈ మూవీని ఒక పార్టుగా కాకుండా రెండు పార్టులుగా నిర్మించాలని డిసైడ్ అయ్యారంట. అందుకు తగినట్లు ఇప్పటికే ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ కూడా రాసుకున్నట్లు చెబుతున్నారు. ఇంక రెండు పార్టుల్లోనూ అదిరిపోయే ఎలివేషన్స్ మాత్రమే కాదు.. మంచి క్లైమాక్స్ కూడా ప్లాన్ చేశారని చెబుతున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలీదు. దీనిపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. కానీ, రెండు పార్టులు అనే విషయం మాత్రం నిజమైతే పవన్ ఫ్యాన్స్ కు పూనకాలనే చెప్పాలి.
THE MOST STYLISH MAN OF INDIAN CINEMA @PawanKalyan Arrived at #OG Pooja Ceremony!! 🔥#FireStormIsComing #PawanKalyan pic.twitter.com/3QYFnwRQ7W
— SumanTV (@SumanTvOfficial) January 30, 2023
ఇంక డైరెక్టర్ సుజీత్ విషయంలో కూడా ఫ్యాన్స్ కు భారీ అంచనాలు ఉన్నాయి. రన్ రాజా రన్ సినిమా బాగా ఆడినా కూడా అంత గుర్తింపు రాలేదు. కానీ, సాహోయ సినిమాతో సుజీత్ రేంజ్ పాన్ ఇండియా లెవల్లోకి వెళ్లిపోయింది. ఆ సినిమా టేకింగ్, ఎలివేషన్స్ అన్నీ తెలుగు- హిందీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. పైగా ఇప్పుడు పవన్ కల్యాణ్ తో చేస్తున్న ప్రాజెక్ట్ గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామా కావడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. అంతేకాకుండా ఫ్యాన్ పవన్ ని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో గబ్బర్ సింగ్ తో హరీశ్ శంకర్ నిరూపించాడు కూడా.
The #OG @PawanKalyan garu begins a new chapter with a formal Pooja Ceremony 😎
Regular shoot begins soon ❤️🔥#FireStormIsComing 🔥 #TheyCallHimOG@Sujeethsign @DVVMovies pic.twitter.com/uWQZDWcqCL
— SumanTV (@SumanTvOfficial) January 30, 2023
ఇంక పవన్ కల్యాణ్ సినిమా విషయానికి వస్తే.. వరుస ప్రాజెక్టులతో పవన్ దూకుడు మీదున్నాడు. ఇప్పటికే క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పవన్ కెరీర్ లో తొలిసారి ఓ సోషియో ఫాంటసీ చిత్రంలో నిటిస్తున్నాడు. ఈ సినిమాని 30 మార్చికి విడుదల చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు హరీశ్ శంకర్ డైరెక్షన్ లో భవధీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే ఇది పట్టాలు ఎక్కుతుంది అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు కూడా పవన్ కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి.
Here are the striking snapshots of @PawanKalyan garu from the pooja ceremony of #OG 😎
He’s gearing up to enthrall you like never before ❤🔥@sujeethsign @DVVMovies #TheyCallHimOG 💥#FireStormIsComing 🔥 pic.twitter.com/R8Bjn5eVzf
— DVV Entertainment (@DVVMovies) January 31, 2023