మళ్ళీ మరోమారు కామెంట్లు షురూ!..
ఆర్ఆర్ఆర్ లో కొన్ని సీన్స్ కాపీ కొట్టారా?
పెద్దగా పట్టించుకోని జక్కన్న…
ఫిల్మ్ మేకర్స్ స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుంచి సీన్స్ రాసేటప్పుడు ఫ్రేమ్ పెట్టి షూట్ చేసేటప్పుడు కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు. కొందరైతే ‘స్ఫూర్తి పొందాం’ అనే ఒక పదం వాడేసి తమకి నచ్చిన సీన్లు, పోస్టర్లు ఒరిజినల్ మాదిరిగానే వాడేస్తుంటారు. ఇక టైటిల్ నుండి పోస్టర్ వరకు ఏ చిన్న పోలిక దొరికినా నెటిజన్లు తెగ ట్రోల్ చేసేస్తుంటారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ వదిలిన పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి మళ్లీ కాపీ కొట్టారంటూ కొందరు నెటిజన్లు బాహాటంగానే విమర్శిస్తుండగా మరికొందరు మాత్రం కేవలం ఘోస్ట్ రైడర్ పోస్టర్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చరణ్ గుర్రంపై, ఎన్టీఆర్ బుల్లెట్‌పై వెళ్తున్న స్టిల్ ఇరు హీరోల అభిమానులకు తెగ నచ్చేసింది. 2007 లో వచ్చిన ‘ఘోస్ట్ రైడర్’. అందులో ఒకరు గుర్రం స్వారీ చేస్తుండగా మరొకరు బైక్ రైడింగ్ చేస్తున్నారు. ఇందులో మండుతున్న నిప్పు ప్రత్యేక ఆకర్షణ అంటూ అప్పట్లో కామెంట్లు చాలా మంది పాస్ చేసారు కూడా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాల కోసం విదేశీ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీ ఆల్ టైం హిట్లు సాధిస్తున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచారు. చరణ్, తారక్ చేతులు పట్టుకుంటూ కనిపించిన పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దోస్తీ సాంగ్ చివరలో కూడా ఎన్టీఆర్, చరణ్ చేతులు పట్టుకోవడం చూపించగా హాలీవుడ్ మూవీ స్టార్ వార్స్ లో కూడా ఇదే విధంగా చేతులను పట్టుకునే సీన్ ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ లోగో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ అనే సిరీస్ లో ఒక సీజన్ టైటిల్ లోగో లాగా ఉందని, రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ని కొమరం భీమ్ గా పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోలో కొన్ని షాట్స్ హాలీవుడ్ సినిమాల మాదిరిగానే ఉన్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేశారు.
మరోవైపు ఈ నెల 1వ తేదీన విడుదలైన దోస్తీ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తికానుంది.
ఏది ఏమైనా స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. జక్కన్న డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాల కోసం విదేశీ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారన్నది అందరికీ తెలిసిన సంగతే.
అందుకీ వీడియో వ్యూస్ సాక్ష్యం: