ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్ కోసం కారు కావాలంటూ.. తిరుమల దర్శనానికి బయలుదేరిన వారిని.. ఒంగోలులో ఓ కానిస్టేబుల్ అడ్డుకుని.. వారి కారుని బలవంతంగా తీసుకెళ్లిన ఘటన వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున విమర్శలు, వ్యతిరేకత చెలరేగింది. ఈ ఘటనపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. తిరుమల వెళ్లే ప్రయాణికుల నుంచి వాహనం స్వాధీనం చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. సీఎం కాన్వాయ్ కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి కారు స్వాధీనం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: సీఎం కాన్వాయ్ కోసం ప్రజల వాహనాల స్వాధీనం ఏంటి?: పవన్ కల్యాణ్
‘భార్యా పిల్లలతో వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డుపై దింపేసే హక్కు మీకు ఎక్కడిది? ముఖ్యమంత్రి పర్యటన ఉంటే కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని పరిస్థితికి రాష్ట్రం ఎందుకెళ్లింది? ప్రభుత్వ అధికారులు అయ్యుండి ఇలాంటి చర్యలకు ఎలా పాల్పడతారు? అధికారులు ఇలాంటి చర్యలతో ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. ఈ ఘటనను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు.
అసలు విషయం ఏంటంటే.. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్ అనే వ్యక్తి బుధవారం రాత్రి కుటుంబంతో కలిసి తిరుమలకు బయల్దేరాడు. హైవే మీద వెళ్తూ ఆకలిగా ఉందని ఏదైనా తినచ్చని ఒంగోలు టౌన్‌లోకి వెళ్లారు. అక్కడకు ఓ కానిస్టేబుల్ వచ్చి సీఎం పర్యటనకు కాన్వాయ్ కోసం వాహనం కావాలంటూ కారులో ఉన్న వారిని దింపేసి అద్దెకు తెచ్చుకున్న కారు, డ్రైవర్ ను తీసుకెళ్లారు. ఏం చేయాలో తెలియక శ్రీనివాస్ రాత్రి నడిరోడ్డుపై ఉండిపోయాడు. ఆ తర్వాత ట్రావెల్స్ వ్యక్తికి ఫోన్ చేయగా మరో వాహనం పంపాడంటూ చెప్పారు. ఒంగోలులో సీఎం కాన్వాయ్ కోసం కారు లాక్కెళ్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.