యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. రామాయణ గాథను సరికొత్త రీతిలో చూపించబోతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించి తాజా అప్ డేట్ ఒకటి నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: పాన్ ఇండియా స్థాయిలో పెరిగిన పూజా హెగ్దే రేంజ్! ఒక్క పాటకే కోట్లలో..!
ఇక విషయం ఏంటంటే? ఈ మూవీలో బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు తెగ ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన ఆమె ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉందంటూ తన సంతోషాన్ని వ్యక్త పరిచింది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఘోస్ట్ సినిమాలో సైతం సోనాల్ చౌహాన్ నటిస్తుండటం విశేషం.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.