SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Bollywood Celebrities Who Went From Bigger To Beggars

Bigger to Beggars: ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి రోడ్డున పడ్డ బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్ళే..

  • Written By: Nagarjuna
  • Published Date - Mon - 29 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Bigger to Beggars: ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి రోడ్డున పడ్డ బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్ళే..

సినిమా అనేది రంగుల ప్రపంచం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తే ప్రపంచంలో ఉన్న అన్ని రంగులూ వీరి దగ్గరనే ఉంటాయి. కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తే ఇక డార్క్‌ కలర్ తప్ప జీవితంలో ఇంకే రంగు ఉండదు. వచ్చినవన్నీ వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోతాయి. సినిమా ఇండస్ట్రీలో ఒకానొక దశలో స్టార్స్‌గా వెలిగిన చాలా మంది జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఆస్తులు పోగొట్టుకుని చేతిలో చిల్లిగవ్వ లేక చివరి దశలో నరకం అనుభవించారు. బిగ్గర్‌ టూ బెగ్గర్‌ స్టేజ్‌కి పడిపోయిన సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు.

ఓపీ నయ్యర్‌:

Bolly wood celebs rich to beggar

దీనికి బాలీవుడ్‌ సెలబ్రిటీలేమీ అతీతం కాదు. ఆసియా యొక్క రిథమ్ కింగ్‌గా పేరు ప్రఖ్యాతులు గాంచిన ఓపీ నయ్యర్‌ ఒకానొక దశలో సినీ పరిశ్రమలో రారాజుగా ఉన్నారు. మ్యూజిక్ కంపోజర్‌గా, సింగర్‌గా, సాంగ్ రైటర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అందించిన ఓపీ నయ్యర్‌ తాగుడుకి బానిసై జీవితాన్ని నాశనం చేసుకున్నారు. కుటుంబాన్ని వదులుకున్నారు. డబ్బు కోసం, మందు కోసం ఇంటర్వ్యూలు ఇచ్చే స్థితికి వచ్చారు. తన మరణానికి ముందు అంత్యక్రియలకు రాకూడదని తన కుటుంబాన్ని నిషేధించారు.

అచల సచ్‌దేవ్‌:

Bolly wood celebs rich to beggar

ఫ్యాషనబుల్‌ వైఫ్‌ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అచల సచ్‌దేవ్‌ ఎక్కువగా యశ్ రాజ్‌ సినిమాల్లో నటించారు. 130కి పైగా హిందీ సినిమాల్లో నటించిన ఈమె ఇండియా, పాకిస్తాన్‌ పార్టీషన్‌ జరగక ముందు లాహోర్‌లో ఆలిండియా రేడియోలో పనిచేశారు. ఆ తర్వాత ఢిల్లీ ఆలిండియా రేడియోలో పనిచేశారు. అయితే భర్త చనిపోయిన తర్వాత ఆమె తన పిల్లలని విడిచి కొన్నాళ్ళు ఒంటరిగా జీవించారు. దురదృష్టవశాత్తు ఈమె తన ఇంట్లోని వంట గదిలో జారిపడి మృతి చెందారు. పూణె హాస్పిటల్‌లో జాయిన్ అయిన ఆమె తన మెదడుకి ఫ్రాక్చర్ అవ్వడంతో ఆమె బతకడం కష్టమైంది. అయితే ఆమె అంత్యక్రియలకు ఆమె పిల్లలు కూడా రాలేదు.

పర్వీన్ బాబి:

Bolly wood celebs rich to beggar

సినిమా వాళ్ళు ఎక్కువగా డిప్రెషన్‌కి గురవుతుంటారు. 1970, 80ల్లో బాలీవుడ్‌ని షేక్‌ చేసిన పర్వీన్ బాబి తీవ్ర డిప్రెషన్‌కి గురయ్యారు. చాలా కాలం పాటు ఈమె ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఉన్నట్టుండి ముంబైలోని ఫ్లాట్‌లో మృతి చెందారు. రెండు రోజులైనా మృతదేహాన్ని తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో బాలీవుడ్ డైరెక్టర్ మహేష్‌ భట్‌ కలగజేసుకుని ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

మీనా కుమారి:

Bolly wood celebs rich to beggar

1940,60ల మధ్య కాలంలో ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించిన బాలీవుడ్ నటి మీనా కుమారి. గుండెలు బాదుకునేంతగా అభిమానం సంపాదించుకున్న ఈమె తన జీవితంలో ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నారు. అది ఆమె జీవితాన్నే మార్చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కమల్ అమ్రోహి నుండి విడిపోయాక మద్యానికి బానిస అయ్యారు. లివర్ పూర్తిగా దెబ్బతినడంతో లండన్‌లో చికిత్స చేయించుకున్నారు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో కోమాలోకి వెళ్ళిపోయారు. కోమాలోకి వెళ్ళిన రెండు రోజుల తర్వాత ఆమె మరణించారు. అప్పుడు ఆమె వయసు 38. చిన్న వయసులోనే ఆమె మరణించడం అభిమాన లోకాన్ని శోకంలో ముంచేసింది.

రాజ్‌ కిరణ్:

Bolly wood celebs rich to beggar

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రిషి కపూర్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన రాజ్‌ కిరణ్ అనే బాలీవుడ్‌ నటుడు అట్లాంటలో మతి స్థిమితం లేని స్థితిలో పడున్నారు. ఇండస్ట్రీకి దూరమైన రాజ్ కిరణ్‌ కోసం అతని సహ నటుడు రిషి కపూర్‌ ఏమైపోయారో తెలుసుకోవాలనుకున్నారు. చివరకి అతని సోదరుడికి ఫోన్‌ చేసి కనుక్కోగా అట్లాంటలో మతి స్థిమితం కోల్పోయి ఉన్నారని తెలిసింది. అంతకు మించి వివరాలు ఇవ్వలేదు. అతను ఏమైపోయారో ఎవరికీ తెలియదు. రాజ్ కిరణ్‌ మిస్ అవ్వడం ఎప్పటికీ మిస్టరీ అని రిషికపూర్ అప్పట్లో లేఖ రాశారు.

మిథాలి శర్మ:

Bolly wood celebs rich to beggar

భోజ్‌పురి నటి మిథాలి శర్మ ఒకానొక టైమ్‌లో మంచి సినిమాలు చేశారు. సడన్‌గా అవకాశాలు రాకపోవడంతో ఆమె తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ముంబై వీధుల్లో బెగ్గర్‌గా మారాల్సి వచ్చింది. ఇటీవలే ఆమె దొంగతనం చేయడానికి ప్రయత్నించగా ఇద్దరు మహిళా పోలీసులు అడ్డుకున్నారు. అయితే మిథాలి శర్మ పోలీసులను కొట్టి అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత బెగ్గర్‌గా దర్శనమిచ్చారు.

భగవాన్‌ దాదా:

Bolly wood celebs rich to beggar

ఖరీదైన కార్లకి, లగ్జరీ బంగ్లాలకి పెట్టింది పేరు భగవాన్‌ దాదా. అంత రిచ్‌గా బతికిన ఈ బాలీవుడ్ నటుడు చివరకి సాధారణ కూలీలు ఉండే ముంబై స్లమ్‌లో మరణించే పరిస్థితి వచ్చింది. ఈయన నటించిన ఝమేలా, లబేలా సినిమాలు డిజాస్టర్‌ కావడంతో ఆయన పతనం మొదలైంది. అదృష్టం ఆవగింజంత అయిపోయింది. దీంతో ఆయన ఆస్తులతో పాటు జీవితం కూడా పోయింది. ముంబై వీధుల్లో ఇతని అధ్యాయం ముగిసింది.

భరత్ భూషణ్‌:

Bolly wood celebs rich to beggar

మూసలో వెళ్తున్న రొమాంటిక్‌ పాత్రలకి ఒక కొత్త రంగు అద్దినటువంటి హీరో భరత్ భూషణ్‌. ఇతని తప్పల్లా మీనా కుమారిని ప్రేమించడమే. ఆమె చెడు అలవాట్లను భరిస్తూ వచ్చారు. చివరికి సినిమాలు మానేసి ఫిల్మ్‌ స్టూడియో దగ్గర గేట్‌ కీపర్‌గా పనిచేశారు. ఒక్కడే ఒక అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు. చివరికి అదే అపార్ట్‌మెంట్‌లో మృతి చెందారు.

గీతాంజలి నాగ్‌పాల్‌:

Bolly wood celebs rich to beggar

ఫ్యాషన్‌ మోడల్‌గా ప్రయాణం మొదలుపెట్టిన గీతాంజలి నాగ్‌పాల్‌ యొక్క చెడు అలవాట్ల వల్ల ఆమె జీవితమే నాశనమైంది. ర్యాంప్‌ వాక్‌ చేయాల్సిన ఆమె చివరకి నడి రోడ్డు మీద వాక్‌ చేయాల్సి వచ్చింది. డ్రగ్స్‌కి, మద్యానికి బానిస అవ్వడం వల్ల బంధాలను కోల్పోయారు. చివరికి ర్యాంప్‌ మీద ఉండాల్సిన ఆమె జీవితం రోడ్డు మీదకొచ్చేసింది. సౌత్‌ ఢిల్లీ వీధుల్లో ముష్టి ఎత్తుకోవడం మొదలుపెట్టారు. పనిమనిషిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆమె మానసిక చికిత్స పొందుతున్నారు.

జగదీశ్‌ మాలి:

Bolly wood celebs rich to beggar

బాలీవుడ్‌లో టాలెంటెడ్‌ ఫోటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న జగదీశ్‌ మాలి కూడా బిగ్గర్‌ నుంచి బెగ్గర్‌ స్టేజ్‌కి వచ్చేశారు. సుమంత్ నటించిన ప్రేమ కథ సినిమా హీరోయిన్‌ అంతర మాలి తండ్రి ఈ జగదీశ్ మాలి. ముంబై అంధేరి వీధుల్లో హాఫ్‌ నేకెడ్‌గా భిక్షాటన చేస్తూ సల్మాన్ ఖాన్ కంట పడ్డారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ అతనికి సహాయం చేశారు. అయితే 15 ఏళ్ళుగా డయబెటిస్‌, అధిక రక్తపోటు, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న జగదీశ్‌ 59 ఏళ్ళ వయసులో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఇలా ఒకానొక టైమ్‌లో స్టార్లుగా రాణించిన వీళ్ళంతా తాగుడికో లేదా డిప్రెషన్‌ కారణంగానో తమ అందమైన జీవితాలను నాశనం చేసుకున్నారు. ఎంత బిగ్గర్ అయినా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే బెగ్గర్‌గానే మిగిలిపోవాల్సి వస్తుంది. మరి బిగ్గర్‌ టూ బెగ్గర్‌ స్టేజ్‌కొచ్చేసిన ఈ సెలబ్రిటీలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.

  • ఇది కూడా చదవండి: హెరాస్‌ చేస్తున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అనసూయ ఫిర్యాదు.. వేట మొదలైందంటూ ట్వీట్‌..
  • ఇది కూడా చదవండి: మైండ్ బ్లాంక్ చేస్తోన్న తెలుగు యాంకర్స్ రెమ్యునరేషన్స్..

Tags :

  • bollywood
  • latest bollywood news
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

    చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

  • మాజీ భర్తపై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్.. తన వ్యక్తిగత వీడియోలు విక్రయించాడంటూ..

    మాజీ భర్తపై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్.. తన వ్యక్తిగత వీడియోలు విక్రయించాడంటూ..

  • పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ పిల్లలు వద్దంటున్నారు: నటి సుస్మితా సేన్

    పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ పిల్లలు వద్దంటున్నారు: నటి సుస్మితా సేన్

  • గుండెపోటుకు గురైన సినీ నిర్మాత!

    గుండెపోటుకు గురైన సినీ నిర్మాత!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam