సినీ, రాజకీయ ప్రముఖులు ఉపయోగించే ప్రతి వస్తువు కూడా ఎంతో ఖరీదు ఉంటుంది. వారు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉండేందుకు ఖరీదైన వస్తువులనే కొనుగోలు చేస్తుంటారు. వాళ్లు కాళ్లకు ధరించే చెప్పుల నుంచి నివాసం ఉంటే ఇంటి వరకు ప్రతిదీ చాలా విలువైనది, ఎంతో విలాసవంతగా ఉండే వాటినే కొనుగోలు చేస్తారు. అయితే కొన్ని సార్లు సెలబ్రిటీలు కొనుగోలు చేసే చిన్న వస్తువుల ధరలు తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఆమె మల్టీకలర్ లో ఉన్న స్వెటర్ ను ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
స్వెట్టర్ లో కత్రినా కైప్ ఎంతో క్యూట్ గా కనిపించింది. అయితే అందరి దృష్టి.. కత్రినా అందంతో పాటు ఆమె ధరించిన స్వెటర్ పై పడింది. ఎంతో ఆకట్టుకుంటున్నా ఆ స్వెటర్ ధర ఎంత ఉంటుందా? అని ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు. అంతటితో ఆగక గూగుల్ సైతం సెర్చ్ చేసి మరి వెతుకుతున్నారు. ఇలా కత్రినాకైఫ్ ధరించిన ఈ రంగు రంగుల స్వెటర్ ధర దాదాపు 445 డాలర్ల అని టాక్ వినిపిస్తోంది. మన ఇండియన్ కరెన్సీలో అయితే ఏకంగా రూ.35 వేలు అని తెలుస్తోంది. ఈ స్వెటర్ ధర తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ స్వెటర్ కి అంత ఖర్చు పెట్టాల్సినంత ప్రత్యేకత ఇందులో ఏముందా? అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు.
అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ ధరించిన ఈ స్వెటర్ ప్రత్యేకత ఏంటి అనే విషయానికి వస్తే అనేక రకాల రంగులు, ఆకట్టుకునే అల్లికతో 100 శాతం పాలిస్టర్ తో తయారైంది. చూడాగానే ఆకట్టుకునేల కనిపించే ఈ స్వెటర్ ను కత్రినా కైఫ్ ఎంతో ధర పెట్టి కొనుగోలు చేసింది. నిత్యం ట్రెండీ వేర్ లో ఎంతో క్లాసిక్ లుక్ లో కనిపించే కత్రినా కైఫ్ ఈ స్వెటర్ లో కూడా ఎంతో క్యూట్ లుక్స్ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కత్రినా ధరించిన స్వెటర్ ధరపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.