గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత హీరోయిన్స్ క్రేజ్ కోసం ఎంతదూరమైనా వెళ్తుంటారు. కొందరు గ్లామర్ పరంగా పాపులర్ అయితే మరికొందరు డి-గ్లామర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ నటన పరంగా మంచి మార్కులు అందుకుంటారు. సినిమాలంటే ఎప్పుడూ ఒకే తరహా సినిమాలతో సర్వైవ్ కాలేరు కదా.. అందుకే ఏదొక టైంలో తమలో దాగిన గ్లామర్ ని కొద్దికొద్దిగా బయట పెడుతుంటారు. అయితే.. హీరోయిన్స్ గ్లామర్ ని బయటపెట్టడంలో రెండు పద్ధతులు ఫాలో అవుతుంటారు. ఒకటి సినిమాలు, రెండు సోషల్ మీడియా. సినిమాలలో గ్లామర్ రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో కంప్లీట్ ట్రెడిషనల్ వేర్ ధరించి ఫోటోలు పోస్టు చేసేవారు మొదటి రకమైతే.. సినిమాలలో డి-గ్లామర్, డీసెంట్ రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో స్కిన్ షో చేసి రచ్చలేపేవారు రెండోరకం. ఈ రెండు పద్దతులను ఫాలో అయ్యే గ్లామరస్ బ్యూటీలు కూడా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఒకప్పుడు గ్లామర్ అంటే సినిమాలలో మాత్రమే చూసేవాళ్ళం. కానీ.. ఈ మధ్యకాలంలో గ్లామర్ షో అనేది స్టార్ హీరోయిన్స్ నుండి డెబ్యూ హీరోయిన్స్ వరకూ అందరికీ మామూలే అయిపోయింది. అందుకే సినిమాలు ఉన్నా లేకపోయినా హద్దులు లేవి పెట్టుకోకుండా అందాల ప్రదర్శన చేసేస్తున్నారు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన. పుష్పకు ముందు వరకు డీసెంట్ లుక్స్ మెయింటైన్ చేసిన రష్మిక.. పాన్ ఇండియా క్రేజ్, బాలీవుడ్ లో అవకాశాలు వచ్చేసరికి అమాంతం గ్లామర్ డోస్ పెంచేసింది. ఇంకా పుష్ప సినిమాలో రష్మిక హాట్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా ముంబైలో రష్మిక గ్లామర్ షోకి సంబంధించి విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కార్ లో నుండి బయటికి వచ్చిన రష్మీక డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే కుర్రాళ్లకు మతులు పోవాల్సిందే అని చెప్పాలి. ఆ స్థాయిలో అందాలను కెమెరా ముందుంచింది రష్మిక. ప్రస్తుతం రష్మిక లేటెస్ట్ వయ్యారాల ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక కెరీర్ పరంగా రష్మిక చేతిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాలున్నాయి. అదీగాక ఇటీవలే సీతారామం సినిమాలో పాకిస్థానీ అమ్మాయిగా మంచి నటన కనబర్చి ప్రశంసలు అందుకుంది. మరి రష్మిక మందన లేటెస్ట్ గ్లామరస్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanmaa)