ప్రతి ఒక్కరి లైఫ్ లోనూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. వాటిలో సొంతిల్లు అనేది కచ్చితంగా ఉంటుంది. సాధారణ వ్యక్తులైనా, సెలబ్రిటీలు అయినా సరే ఈ విషయంలో అతీతులు ఏం కాదు. ఎందుకంటే అద్దె ఇంట్లో ఉండే కంటే మన కష్టపడి కట్టుకున్న ఇంట్లో ఉన్నప్పుడు ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే.. యాంకర్ గా ఫేమస్ అయిన శివజ్యోతి సొంతిల్లు కట్టుకుంది. తాజాగా గృహప్రవేశం కూడా జరిగింది. పలువురు యాంకర్స్ , సోషల్ మీడియా సెలబ్రిటీలు.. ఈ వేడుకకు విచ్చేసి జ్యోతక్కకు విషెస్ చెప్పారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కొన్నేళ్ల క్రితం ఓ న్యూస్ ఛానెల్ లో టెలికాస్ట్ అయిన ‘తీన్మార్’ ప్రోగ్రామ్ కు శివజ్యోతి యాంకరింగ్ చేసింది. సావిత్రిగా చాలా ఫేమస్ అయింది. ఇక బిగ్ బాస్ మూడో సీజన్ లో అడుగుపెట్టిన తర్వాత ఈమె అసలు పేరు అందరికీ తెలిసింది. అలా ఆ తర్వాత పలు న్యూస్ ఛానెల్స్ లో పనిచేస్తున్న శివజ్యోతి.. మరోవైపు యూట్యూబర్ గానూ వీడియోలు చేస్తూ ఫుల్ ఫేమస్ అయిపోయింది. అందులో భాగంగానే చాలా పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రోగ్రామ్స్, యాంకరింగ్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.
ఇప్పటివరకు హైదరాబాద్ లో భర్తతో కలిసి శివజ్యోతి అద్దె ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు తన సొంతింటి కలని నెరవేర్చుకుంది. తాజాగా గృహప్రవేశం జరగ్గా.. హిమజ, దీప్తి సునాయన, మై విలేజ్ షో మెంబర్స్ తోపాటు పలువురు టీవీ సెలబ్రిటీలు కూడా విచ్చేశారు. శివజ్యోతి దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు శివజ్యోతి కొత్తింట్లో దిగిన ఫొటోలు పోస్ట్ చేసిన హిమజ కూడా ప్రస్తుతం సొంతిల్లు కట్టుకుంటుంది. త్వరలో ఆమె కూడా గృహప్రవేశం చేయనుందని తెలుస్తోంది. ఇదంతా పక్కనబెడితే జ్యోతక్క.. నూతన గృహప్రవేశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.