Hari Teja: బుల్లితెర యాంకర్ గా, సినీ నటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బిగ్ బాస్ బ్యూటీ హరితేజ. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన హరితేజ.. తెలుగులో చాలా సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా పాల్గొని సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
బిగ్ బాస్ లో హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్.. హరితేజకు ,’లౌడ్ స్పీకర్’ అని ముద్దుపేరు కూడా పెట్టిన సంగతి విదితమే. అయితే.. కెరీర్ లో బిజీగా ఉన్నప్పుడే 2015లో దీపక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది. ఇక లాక్ డౌన్ లో పండంటి బిడ్డకు జన్మనిచ్చి గుడ్ న్యూస్ చెప్పింది హరితేజ. మొదట బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన హరితేజ.. ప్రస్తుతం తన కూతురు, భర్తతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తోంది.
బుల్లితెరపై సీరియల్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ.. తెలుగులో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మూవీతో సినీ కెరీర్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో వరుస అవకాశాలతో బిజీ అయ్యాక.. సీరియల్స్ కంటిన్యూ చేసింది. ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు హరి. ఇప్పుడు మళ్లీ సినిమాలలో బిజీ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం తన పాప, భర్తతో కలిసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి హరితేజ ఫ్యామిలీ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.