సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి అడుగు పెడితో లైఫ్ మారిపోతుందని ఎంతో మంది అంటుంటారు. జీవితంలో ఒక్కసారైనా తెరపై కనిపించాలని ఎంతో మంది కళాకారులు అనుకుంటారు. కానీ అతి కొద్ది మందికే ఆ కల సాకారం అవుతుంది.. అదృష్టం కలిసి వస్తుంది. ఒక్కసారి తెరపై కనిపిస్తే సెలబ్రెటీ హూదా ఏ రేంజ్ లో వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కానీ ఓ స్టార్ నటి తాను నమ్మిన సిద్దాంతాలు.. మతం కోసం సినీ ఇండస్ట్రీకి వీడ్కోలు పలికింది. భోజ్ పూరికి చెందిన ప్రముఖ నటి సహారా అఫ్షా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
భోజ్ పూరి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ప్రముఖ స్టార్ హీరోయిన్ సహారా అఫ్షా. తన అందం, అభినయంతో పాటు డ్యాన్స్ తో కుర్రాళ్ల మనసు దోచింది. ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు వస్తు బిజీగా ఉంటున్న సహారా అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా కొంత మంది హీరోయిన్లు తమ వివాహం జరిగిన వెంటనే ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతారు. కానీ సహారా అఫ్షా మాత్రం మతం కోసం సినీ పరిశ్రమకు దూరం కావాలని నిర్ణయించుకుంది.
ఇస్లాం మత మార్గంలో వెళ్లడానికి తాను సినీ పరిశ్రమను వదిలేస్తున్నానని.. తన జీవితంలో గొప్ప నిర్ణయం ఏదైనా ఉంటే అది ఇదేనని తెలిపింది సహారా. ఇండస్ట్రీలో తనను ఈ స్థాయికి తీసుకు వచ్చి ఎంతో ప్రేమాభిమానాలు చూపించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇక ముందు మానవాళి సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానని.. తన సంకల్పానికి అల్లా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని భావిస్తున్నట్టు సహారా అఫ్షా తెలిపింది.
సినీ ఇండస్ట్రీలో ఈ తరహా నిర్ణయాలు కొత్తవేమీ కాదు. గతంలో పలువురు హీరో, హీరోయిన్లు కూడా మతం మార్చుకొని సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. దంగల్ చిత్రంలో నటించిన జైరా వాసిమ్ మతం మార్చుకొని ఇండస్ట్రీకి దూరమయ్యారు. అప్పట్లో హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సనా ఖాన్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు.
ఇది కూడా చదవండి : దర్శక-నటుడు సముద్రఖని ఆఫీస్ లో దొంగతనం చేసిన మహిళ
ఇది కూడా చదవండి : వీడియో: ఒకప్పుడు స్టార్ నటి.. ఇప్పుడు బిక్షాటన చేస్తుంది!