సినీ ఇండస్ట్రీ అంటే ఓ అద్బుతమైన రంగుల ప్రపంచం. ఒక్కసారి తెరపై కనిపిస్తే చాలు జీవితం ధన్యం అనుకునే వారు కోట్ల మంది ఉంటారు. సినిమా చాన్సుల కోసం స్టూడియోల చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటారు. సినిమాల్లో చాన్సు వస్తే ఒక్కసారే సెలబ్రెటీ హోదా వస్తుంది.. సమాజంలో ఎక్కడ లేని గౌరవం పెరిగిపోతుంది. కానీ కొంత మంది జీవితాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాయి.. కోట్లు సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించిన వారు చివరి దశలో కడు బీద స్థితిలో చనిపోయిన వారు ఉన్నారు.
కొంత మంది నటీనటులు సెలబ్రెటీ హూదా విడిచి పెట్టి ప్రశాంతమైన జీవితాన్ని పొందేందుకు సన్యాసులుగా మారినవారు కూడా ఉన్నారు. ఒకప్పుడు బాలీవుడ్ వెండితెర, బుల్లితెరపై స్టార్ నటిగా రాణించిన నూపూర్ అలంకార్ ఇప్పుడు సన్యాసినిగా మారారు. అంతేకాదు దేవాలయాల వద్ద ఆమె బిక్షాటన చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ లో వెండితెర, బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ప్రముఖ నటి నూపూర్ అలంకార్. అప్పట్లో టెలివిజన్ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన శక్తిమాన్ సీరియల్ లో కీలక పాత్ర పోషించారు నుపూర్. ఆ తర్వాత పలు సినిమాలు, సీరియల్స్ లో నటించి మంచి నటిగా గుర్తింపు సంపాదించారు. నూపూర్ అలంకార్ సెలబ్రెటీ హూదా వదిలిపెట్టి అందరూ ఆశ్చర్యపోయే విధంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇటీవల ఆమె సన్యాసినిగా మారారు.
ఉత్తర్ ప్రదేశ్ లో పూర్తిగా కాషాయ దుస్తులు ధరించిన ఆమె గోవర్ధన్లోని దంఘటి దేవాలయం వద్ద భిక్షాటన చేస్తూ కనిపించింది. గత కొంత కాలంగా తన ఫ్యామిలీ లైఫ్ లో ఇబ్బందులు పడ్డానని.. ఆ సమయంలో తన గురువు సూచనతో సన్యాసం తీసుకున్నట్లు నుపూర్ తెలిపారు. తాను బిక్షాటన చేస్తే కొంత డబ్బు వస్తుందని.. ప్రస్తుతం జీవితాం ఇలా గడిచిపోతుందని అంటున్నారు. కాగా, నూపూర్ అలంకార్ బిక్షాటన చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.