అతడో ప్రముఖ దర్శకుడు. తమిళంలో స్టార్ డైరెక్టర్ గా తొలుత గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సొంత భాషతో పాటు తెలుగులోనూ కీలక పాత్రలు పోషిస్తూ బిజీగా మారిపోయాడు. అలాంటి ఆయన ఆఫీస్ లో దొంగతనం జరిగింది. అది చేసింది ఓ మహిళ కావడంతో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పోలీసులు ఈ విషయం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దొంగతన గురించి మీరు కచ్చితంగా షాకవుతారు. అలాంటి ఆశ్చర్యకర రీతిలో దొంగతనం జరిగింది మరి..
ఇక వివరాల్లోకి వెళ్తే.. 2001లో నటుడిగా కెరీర్ ప్రారంభించిన సముద్రఖని, ‘పతాలే పరవశం’ సినిమాలో చిన్న పాత్రలో నటించారు. సుబ్రహ్మణ్యపురం(తెలుగులో ‘అనంతపురం’) సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏడాదే ‘శంభో శివ శంభో’ చిత్రంతో దర్శకుడిగా మారారు. రవితేజ, అల్లరి నరేశ్, శివ బాలాజీ నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైనప్పటికీ, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. రఘువరన్ బీటెక్ లాంటి సినిమాతో తెలుగువాళ్లకు పరిచయమయ్యారు. ఈ మధ్య కాలంలో భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్, సర్కారువారి పాట, గాడ్ ఫాదర్ లాంటి చిత్రాల్లోనూ కీలకపాత్రలు పోషించి పేరు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా సముద్రఖని డైరెక్షన్ లో.. పవన్ కల్యాణ్ హీరోగా ‘వినోదయ సీతం’ రీమేక్ తీస్తున్నారు.
ఇకపోతే చెన్నైలోని మధురవాయిల్ లో దర్శక నటుడు సముద్రఖనికి ఓ ఆఫీస్ ఉంది. శుక్రవారం అక్కడికి వచ్చిన ఓ అపరిచితురాలు.. కారుపై ఆరేసిన రెయిన్ కోట్స్ దొంగిలించింది. ఈ మేరకు ఆఫీస్ మేనేజర్ కార్తీక్.. స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలించారు. అందులో ఓ మహిళ.. ఆఫీస్ లో చొరబడి, అక్కడ కారుపై ఆరబెట్టిన రెయిన్ కోట్స్ తీసుకుని, వాటిని వేసుకుని.. కారుపై కాసేపు పడుకుని వెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి. ఈ విచిత్రమైన దొంగతనాన్ని చూసి నెటిజన్స్ కూడా అవాక్కవుతున్నారు. మరి ఈ దొంగతనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.