బాలకృష్ణ అంటే మాస్ కా బాప్.. గాడ్ ఆఫ్ మాసెస్.. ఆయన సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యిందంటే ఫ్యాన్స్ కి పిచ్చ పూనకాలు వచ్చేస్తాయి. జై బాలయ్య అంటూ అరుపులతో గోల గోల చేస్తారు. డైలాగ్స్ చెప్పినా, ఫైట్స్ చేసినా, డ్యాన్స్ చేసినా ఆ రచ్చ మామూలుగా ఉండదు. సాధారణ ప్రేక్షకులు సైతం బాలయ్య యాక్టింగ్ చూస్తే విజిల్స్ వేయకుండా ఉండలేరు. వెండితెర మీదే కాదు.. స్మాల్ స్క్రీన్ లో కూడా అన్ స్టాపబుల్ ఎనర్జీతో ఆహా అనిపించే విధంగా టాక్ షో చేస్తూ.. తెలుగు ప్రేక్షకుల మన్నన పొందారు. బాలయ్య మొదటిసారిగా హోస్ట్ గా చేసిన ఎపిసోడ్.. ఏకంగా ఇండియాలో ఉన్న టాక్ షోస్ అన్నిటికీ బాప్ గా నిలిచిందని ఇప్పటికే అల్లు అరవింద్ ప్రకటించిన విషయం తెలిసిందే.
మొన్న ప్రభాస్ ఎపిసోడ్ తో.. ఆ షో రేంజ్ నార్త్ వరకూ వెళ్ళింది. బాలయ్య అంటే ఏంటో అక్కడి జనాలకు బాగా తెలిసొచ్చింది. దీన్నే క్యాష్ చేసుకోవాలని భావించారు మేకర్స్. అఖండ సినిమాని హిందీ భాషలో విడుదల చేశారు. అఖండ సినిమా మన తెలుగులో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. బాలకృష్ణని ఒక రేంజ్ లో నిలబెట్టిన సినిమా. ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరా పాత్రలో అద్భుతంగా నటించారు. సినిమా చూస్తున్నంత సేపు ఫ్యాన్స్ నుంచి సాధారణ ప్రేక్షకుల వరకూ ప్రతీ ఒక్కరూ ఏదో తెలియని అనుభూతికి లోనయ్యారు. బాలకృష్ణ నట విశ్వరూపం చూసిన ఫ్యాన్స్ కి రోమాలు నిక్కబొడుచుకునేలా నటించారు. సింహా, లెజెండ్ తర్వాత అంతకు మించిన స్థాయిలో అతి పెద్ద హిట్ కొట్టిన సినిమా ఇదే.
ఈ సినిమాతో బాలయ్య మరోసారి హిట్ ట్రాక్ లో పడ్డారు. అఖండ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా హిట్ తో ఫుల్ జోష్ మీదున్న బాలయ్య.. అదే ఊపుని కొనసాగిస్తూ చేసిన వీర సింహారెడ్డి సినిమా కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఒక పక్క సినిమాలు, మరో పక్క టాక్ షో ఇలా బాలకృష్ణ.. ఎక్కడ కాలు పెడితే అక్కడ దూసుకుపోతున్నారు. బాలకృష్ణ ఇమేజ్, దానికి తోడు డివోషనల్ టచ్ ఉన్న సినిమా కావడంతో అఖండ సినిమాని బాలీవుడ్ లో విడుదల చేశారు. కానీ ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అయితే నమోదు చేయలేదు. కార్తికేయ 2 సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.
స్టార్ హీరో కాదు.. అయినా గానీ నిఖిల్ ని బాలీవుడ్ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. ఎటువంటి స్టార్ కాస్ట్ లేకపోయినా ‘కార్తికేయ 2’ సినిమాని అంత పెద్ద హిట్ చేశారు. అలాంటిది స్టార్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ సినిమాని కూడా ఆదరిస్తారని అనుకున్నారు. అక్కడ కూడా ఘన విజయాన్ని సాధిస్తుందని అనుకున్నారు. కానీ ఇక్కడ సాధించిన విజయాన్ని బాలీవుడ్ లో నమోదు చేయలేకపోయింది. దీంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. అయితే ఈ సినిమా బాలీవుడ్ లో ఫెయిల్ అవ్వడానికి కారణం డబ్బింగ్ అని అంటున్నారు. డబ్బింగ్ వల్ల ఆ పాత్రలో ఉన్న సోల్ మిస్సయ్యిందని. అక్కడి వాళ్ళ డబ్బింగ్ తో సినిమాని చెడగొట్టారని అంటున్నారు. అదే బాలయ్యతో డబ్బింగ్ చెప్పించి ఉంటే ఆ ఫలితం మరోలా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కార్తికేయ 2 సినిమాని బాలీవుడ్ ప్రేక్షకులు ఓన్ చేసుకోవడానికి కారణం.. హిందీ వెర్షన్ కి నిఖిల్ సిద్దార్థ్ డబ్బింగ్ చెప్పడమే. కంటెంట్ బాగుంది, వాయిస్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. అందుకే ఆ సినిమా అంత పెద్ద విజయాన్ని సాధించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బింగ్ సినిమాలు అందరి హీరోలకు సూట్ అవ్వవు. బాలకృష్ణ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ని మ్యాచ్ చేయడం ఎవరి వల్లా కాదని.. అది ఒక్క బాలకృష్ణకు మాత్రమే సాధ్యమని ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటి? అఖండ సినిమా హిందీ వెర్షన్ కి బాలయ్య తన వాయిస్ ఇచ్చి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేదా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.