సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు చక్కం తిప్పిన బ్యూటీ అనుష్క శెట్టి. “భాగమతి” సినిమా తర్వాత గ్యాప్ ఇచ్చింది ఈ అమ్మడు. అరుంధతి అరగొట్టి, బాహుబలితో దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది ఈ జేజమ్మ. ఆ మధ్య నిశ్శబ్దంతో ఓటీటీలో సందండి చేసింది. ప్రస్తుతం ఈ భామ కొత్త ప్రాజెక్టుల ఫోకస్ పెట్టింది. అనుష్క సినిమాల కోసం తన శరీర ఆకృతిని సైతం మార్చుకుంటుంది. అనుష్క జీరో సైజ్ సినిమా కోసం అప్పట్లో బరువు పెరిగింది. అనంతరం చాలా కాలానికి బరువు తగ్గింది. అయితే తాజాగా మళ్లీ పెరిగి కనిపించింది ఈ అమ్మడు. ప్రస్తుతం అనుష్కకు సంబంధించిన ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనుష్క శెట్టి అంటే ఛాలెంజింగ్ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్. దర్శకనిర్మాతల కోసం ఎక్కువగా ఆలోచిస్తుంది అనుష్క. కథ కొత్తగా ఉండి అందులో తన పాత్ర వెరైటీ గా ఉంటే ఒక్క క్షణం ఆలోచించకుండా మేకర్స్ కు ఓకే చెప్పేస్తుంది. అలా చేసిన మొదటి సినిమా సూపర్. కెరీర్‌లో ఫస్ట్ మూవీ సూపర్. దీనితోనే అనుష్క రిక్స్ చేయడం మొదలుపెట్టింది. నాగార్జున, సోనూసూద్‌లతో సమానంగా బైక్ నడిపి ఔరా అనిపించింది. ఆ తర్వాత అరుంధతి సినిమా అనుష్క కెరీర్‌లో గొప్ప మలువు. అనంతరం ఆమెకు అనేక సినిమాలో వరుస ఆఫర్లు వచ్చాయి. అలా వచ్చిన సినిమా “సైజ్ జీరో”.
ఈ సినిమా అనుష్క భారీగా బరువు పెరిగింది. అనంతరం సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టింది. అనంతరం కొన్ని మళ్లీ బిజీగా మారింది. ఇటీవలే నిశ్శబ్దం మూవీతో ఓటీటీలో సందండి చేసింది. ఇప్పుడు మరోసారి బరువు పెరిగి కనిపించింది. తన #Anushka 48 మూవీ కోసం మళ్లీ బరువు పెరిగి బొద్దు గా కనిపించింది ఈ కన్నడ బ్యూటీ. ప్రస్తుతం స్వీటీకి సంబందించిన ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sweety #Anushkashetty#Anushka48 pic.twitter.com/1mZu1a2uz1
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) July 29, 2022