పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సర్జరీ చేయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ స్పెయిన్‌లో ఉన్నారు. అక్కడే ఆయన సర్జరీ చేయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకు అశ్వనీదత్ వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. కొన్ని నెలల కింద ప్రభాస్.. తన కొత్త మూవీ సలార్ షూటింగ్‌లో గాయపడినట్టు సమాచారం. ఈనేపథ్యంలోనే ఆయన స్పెయిన్‌లో సర్జరీ చేయించుకున్నట్టు వార్తలు బయటకొస్తున్నాయి. ప్రభాస్ రీసెంట్‌గా రాధేశ్యామ్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ డిజాస్టర్ ఫలితం అందుకుంది. 'రాధేశ్యామ్' విడుదలైన వెంటనే, ప్రభాస్ విదేశాలకు వెళ్ళారు. రెస్ట్ కోసం అనుకున్నారు కానీ శస్త్ర చికిత్స కోసం అని తెలిస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ వెల్లడించారు. 'ప్రాజెక్టు K' సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ.. 'సీతారామం ప్రీరిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ ముఖ్య అతిథిగా రావాల్సి ఉండగా.. సర్జరీ కోసం అబ్రాడ్ లో ఉండటంతో రావట్లేదు' అని అశ్వినీదత్ చెప్పారు. అయితే.. సర్జరీ విజయవంతం అయిందని తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు ప్రభాస్‌ను విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు కోరారట. పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు నెలలు పడుతుందని, అప్పటివరకు ప్రభాస్ షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చాడని అంటున్నారు. దీని కారణంగా సలార్ విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. ప్రభాస్ ఇప్పటికే 'ఆదిపురుష్' షూటింగ్ పూర్తి చేశాడు. ఈ సినిమా జనవరి 12, 2023 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'సలార్', 'ప్రాజెక్ట్ k' సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Huge Personality like Hilk But Mentality Like Child ❤️❤️❤️ 100 likes for his Charecter . . .#ReleaseAdipurushFirstLook#Prabhas #Salaar #Adipurush#ProjectK pic.twitter.com/cX4sSGoauo — Anantapur PRABHAS FC (@Prabhas_BILLA_) July 25, 2022 ఇదీ చదవండి: సినీ ఎంట్రీపై మెగాడాటర్ నిహారిక భర్త చైతన్య క్లారిటీ..! ఇదీ చదవండి: షోలో భార్యను పరిచయం చేసిన కమెడియన్ రియాజ్!