సాధారణంగా ఏదైనా పండగ వస్తోంది అంటే.. ఇంట్లో ఎంత హడావిడి చేస్తామో మనందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు అందరు ఇదే పండగ జోష్ లో ఉన్నారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని రెండు రోజుల ముందు నుంచే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే మెగా కజిన్స్ అంతా ఓ చోట చేరి సీక్రెట్ శాంట గేమ్ ఆడిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సెలబ్రిటీకి చెందిన క్రిస్మస్ వేడుకల్లో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రముఖ యాంకర్ శ్యామల శాంటక్లాస్ లా మారిన ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
యాంకర్ శ్యామల.. ఓ చిన్నపాటి హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ ఉంది ఈ అమ్మడుకి. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్స్ లో ఒకరిగా పేరుతెచ్చుకుంది. ఇక ఇప్పటికీ పలు చిత్రాల్లో నటించి నటనలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో తన అందంతో పాటుగా చలాకీ మాటలతో అభిమానులను అలరిస్తు ముందుకు సాగుతోంది. ఇక సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటుంది ఈ సోయగం. తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే క్రిస్మస్ వేడుకలను ప్రారంభించినట్లు ఇన్ స్టాలో ఫోటోలు షేర్ చేసింది. శాంతా క్లాజ్ లా మారి ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఇంట్లో క్రిస్మస్ వేడుకలను ప్రారంభించి ఇల్లును అద్బుతంగా అలంకరించింది. రెడ్ అండ్ వైట్ డ్రస్ లో శాంతక్లాజ్ లా మారిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.