సినిమా ప్రపంచంలో సెలబ్రిటీలపై రకరకాల పుకార్లు వస్తూంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని రోజుల తర్వాత అవ్వే నిజాలుగా భయటపడ్డ సందర్భాలూ లేకపోలేదు. అందుకే అంటారు పెద్దలు నిప్పు లేనిదే పొగ రాదని. ఈ క్రమంలోనే తాజాగా హీరోయిన్ అమలాపాల్ తన మాజీ ప్రియుడు సింగర్ భవ్ నిందర్ సింగ్ లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతా బాగానే ఉంది అనుకున్న అమలాపాల్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె బాయ్ ఫ్రెండ్ కు తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదీ కాక అతడు పెళ్లికి సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే అతడికి కోర్టు బెయిల్ ఇచ్చినట్లు కోలివుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అమలాపాల్.. గత కొన్ని రోజులుగా కోలీవుడ్ వర్గాల్లోనే కాక సినీ పరిశ్రమలో బాగా వినిపిస్తోన్న పేరు. దానికి కారణం కొన్ని రోజుల క్రితం ఆమె తమిళనాడు పోలీసులకు తన మాజీ ప్రియుడు అయిన భవ్ నిందర్ సింగ్ తనను వేధిస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న విల్లుపురం క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అతడిని అరెస్ట్ చేశారు. దీంతో అంతా సవ్యంగానే జరుగుతుంది అనుకున్న హీరోయిన్ కు తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమలాపాల్ మాజీ ప్రియుడైన భవ్ నిందర్ సింగ్ కు తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కీలక పత్రాలు సమర్పించినందుకే అతడికి బెయిల్ వచ్చిందని అక్కడి వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
అసలు విషయం ఏంటంటే? 2017లోనే అమలాపాల్ పంజాబీ నటుడు భవ్ నిందర్ సింగ్ ను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఆమె ఖండించింది. అవి కేవలం ఓ ప్రమోషన్ షూట్ లో భాగంగానే తీసినవని తేల్చి చెప్పింది. కానీ సదరు వ్యక్తి భవ్ నిందర్ సింగ్ మాత్రం అవి నిజమైనవేనని అని వాటికి సంబంధించిన సాక్ష్యాలను తాజాగా కోర్టులో సమర్పించినట్లు వినికిడి. అతడి సాక్ష్యాధారాలను పరిశీలించే అతడికి బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అమలాపాల్ భవ్ నిందర్ సింగ్ పై కేవలం లైంగిక ఆరోపణలే కాక ఆర్థికంగా కూడా మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. గతంలో వీరిద్దరు కలిసి “కడావర్” సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారట.
అప్పుడు తప్పుడు పత్రాలు చూపించి ప్రొడక్షన్ కంపెనీని తన వశం చేసుకున్నట్లు అమలాపాల్ గతంలో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇదిలా ఉండగా అమలాపాల్ చెప్పినవి అన్నినిజాలే అయితే అతడికి బెయిల్ ఎలా ఇచ్చింది కోర్టు అని కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఐతే అమలాపాల్ చెప్పినవన్నీ అబద్దాలేనా అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.