పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్పకి సీక్వెల్ గా 'పుష్ప 2' చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వైజాగ్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న బన్నీ.. తదుపరి షెడ్యూల్ కి గ్యాప్ లభించడంతో వెంటనే ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. అదీగాక ఈ వెకేషన్ లో ఫ్యాన్స్ కి కొత్త సర్ప్రైజ్ ఇచ్చాడు బన్నీ.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్పకి సీక్వెల్ గా ‘పుష్ప 2’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వైజాగ్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న బన్నీ.. తదుపరి షెడ్యూల్ కి గ్యాప్ లభించడంతో వెంటనే ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉండే సెలబ్రిటీలు అప్పుడప్పుడు ఇలా షూటింగ్స్ గ్యాప్ లో ఫారెన్ ట్రిప్స్ కి వెళ్లి వస్తుంటారు. తాజాగా బన్నీ సతీమణి అల్లు స్నేహారెడ్డి షేర్ చేసిన వీడియో ద్వారా ఈ విషయం ఫ్యాన్స్ కి తెలిసిందని చెప్పాలి. అదీగాక ఈ వెకేషన్ లో ఫ్యాన్స్ కి కొత్త సర్ప్రైజ్ ఇచ్చాడు బన్నీ.
ఇక అల్లు స్నేహారెడ్డి షేర్ చేసిన వీడియో చూస్తుంటే.. రాజస్థాన్ లోని రణతంబోర్ నేషనల్ పార్క్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. వీకెండ్ సమయాన్ని బన్నీ తన ఫ్యామిలీతో అక్కడ స్పెండ్ చేశాడట. అంతేగాక నేషనల్ పార్కులో బన్నీ, కొడుకు ఆయాన్ తో కలిసి టైగర్ సఫారీని ఎంజాయ్ చేస్తున్న వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బన్నీ తన కొడుకు పక్కన కూర్చుని కారులో నుంచే కొన్ని అడుగుల దూరంలో కనిపించే పులిని కెమెరాలో షూట్ చేశారు. ప్రెజెంట్ అల్లు స్నేహరెడ్డి షేర్ చేసిన వీడియోతో పాటు నెట్టింట ఈ వీడియో కూడా ట్రెండ్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ ఈ వీడియోలో కొత్త లుక్ లో దర్శనమివ్వడం విశేషం. బ్లాక్ అండ్ వైట్ స్టైలిష్ అవుట్ ఫిట్ లో.. బన్నీ హెయిర్ స్టయిల్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో బన్నీ కొత్త లుక్ చూసిన వారందరికీ సర్ప్రైజ్ దొరికిందని చెప్పాలి. ఎందుకంటే.. బన్నీ ఓవైపు పుష్ప సినిమా చేస్తూనే.. మరోవైపు కింగ్ షారుఖ్ ఖాన్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘జవాన్’ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడీ కొత్త హెయిర్ స్టైల్ లుక్ కూడా జవాన్ సినిమాకి సంబంధించినది అని టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే జవాన్ సినిమాలో బన్నీ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అర్థమవుతుందంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. బన్నీ కొత్త లుక్ పై క్లారిటీ రావాల్సి ఉంది. మరి బన్నీ కొత్త లుక్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#AlluArjun from #Jawan sets pic.twitter.com/KHNwZpxcBA
— AA – Admirer ™ (@DpAadhf) February 28, 2023
Allu Arjun Did Tiger Safari At Ranthambhore On Friday Morning 🔥😍😍@alluarjun #AlluArjun #PushpaTheRule pic.twitter.com/aHOc3wRF0Y
— KA̶A̶rthikᴾᵘˢʰᵖᵃᵀʰᵉᴿᵘˡᵉ 🪓 (@KarthikAADHF__) February 28, 2023