అభిమానులు లేనిదే తాము లేమని చెప్పుకుంటారు హీరోలు. ఫ్యాన్స్ ప్రేమే తమకు ఊపిరి అంటారు. అయితే అలాంటి అభిమానికి కష్టం వస్తే ఆదుకునే హీరోలు చాలా తక్కువ. తాజాగా ఐకాన్ స్టార్.. కష్టాల్లో ఉన్న అభిమానిని ఆదుకుని నిజమైన హీరోగా నిలిచాడు. ఆ వివరాలు..
రూపాయి సాయం చేస్తే.. వంద రూపాయల ప్రచారం కోరుకునే కాలం ఇది. చేసేది గోరంత.. చెప్పేది కొండంత టైపు దాన కర్ణులు సమాజంలో పెరుగుతున్నారు. చాలా మంది చిన్న చిన్న సాయాలు చేసి.. వాటికి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. కానీ మన పెద్దలు మాత్రం.. కుడి చెత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. అంటే మనం చేసే సాయం.. అంత గుప్తంగా ఉండాలని దాని అర్థం. ప్రస్తుత కాలంలో అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఈ కోవకు వస్తారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అభిమాని కష్టాల్లో ఉన్నట్లు తెలుసుకున్న బన్నీ.. అతడికి భారీ మొత్తం సాయం చేసి తన మంచి మనసు చాటుకున్నాడు. ఆ వివరాలు..
అల్లు అర్జున్‌కు దానగుణం కాస్త ఎక్కువే. ప్రకృతి విలయాలు వంటివి సంభవించినప్పుడు.. భారీ మొత్తాన్ని విరాళంగా ఇస్తుంటాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక కేరళలో భారీ వరదలు ముంచెత్తినప్పుడు కూడా అల్లు అర్జున్ లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఇక తాజాగా మరోసారి అల్లు అర్జున్ చేసిన సాయం నెట్టింట వైరల్‌గా మారింది. అర్జున్ కుమార్ అనే వ్యక్తి.. బన్నీకి వీరాభిమాని. ఇక అర్జున్ కుమార్ తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. వైద్యం కోసం రెండు లక్షల రూపాయలు కావాలి. కానీ అర్జున్ కుమార్‌కి అంత మొత్తాన్ని భరించే శక్తి లేదు.
ఈ క్రమంలో అర్జున్ తండ్రి అనారోగ్యం గురించి తెలుసుకున్న బన్నీ అభిమానులు.. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తోచినంత సాయం చేసి.. అర్జున్ కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం కాస్త.. గీతా ఆర్ట్స్ కంటెంట్ హెడ్ శరత్ చంద్ర నాయుడి దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన స్వయంగా బన్నీని కలిసి.. అర్జున్ కుమార్ పరస్థితిని వివరించాడు. తన అభిమానికి వచ్చిన కష్టం తెలుసుకుని బన్నీ చలించిపోయాడు. వెంటనే స్పందించి.. అర్జున్ కుమార్ తండ్రి వైద్యానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని మాట ఇచ్చాడు బన్నీ. అంతేకాక చికిత్సకు అవసరమైన మొత్తాన్ని పంపించి కష్టాల్లో ఉన్న అభిమానిని ఆదుకుని నిజమైన హీరోగా నిలిచాడు బన్నీ.
బన్నీ చేసిన సాయం పట్ల అర్జున్ కుమార్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. తన కష్టం గురించి తెలుసుకోవడమే కాక.. వెంటనే స్పందించి.. ఇంత మొత్తాన్ని అందజేసిందుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా అర్జున్ కుమార్ బన్నీని ఉద్దేశించి.. ‘‘నన్ను గుర్తు పెట్టుకున్నావ్.. నా ఫోటో చూడగానే.. నన్ను గుర్తు పట్టావ్. నేను నీకు తెలుసు అన్నావ్. ఆ మాట విని ఆనందంతో ఏడ్చేశాను అన్న. నా కుటుంబానికి నీవు చేసిన సాయాన్ని ఎన్నటికి మరవను. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అన్నా’’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్త తెలుసుకుని బన్నీ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి బన్నీ చేసిన సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Hello Everyone !!!!
Our co-fan Arjun Kumar’s father suffering from lungs injection… Need 2 Lakhs for Medical Treatment. His family in need of our help.
Phonepe & Google Pay
—>> 9133133144 <<–Donate as much as you can ❤️
PLEASE KINDLY SHARE THIS🙏 pic.twitter.com/NgTcmIUdcJ— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) February 1, 2023
Thank you for helping me Annaya my hero @alluarjun ❤️🫶🏻 🤗 I wanted to express my personal gratitude for contributed. anna ❣️ &specially @imsarathchandra anna 🛐 Thank you for being a great example of leadership to me.🫡 I am forever thankful for this help anna 🤗❤️ pic.twitter.com/eB0fmdvHgV
— ᗩᖇᒎᑌᑎ ᛕᑌᗰᗩᖇ (@ArjunKumar_AAA) February 9, 2023