అలియా భట్.. ట్రిపులార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరైంది. తన నటన, అందం, అమాయకత్వంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఏప్రిల్ 14 2022న రణబీర్ కపూర్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత నుంచి అటు ప్రొఫెషనల్ లైఫ్, ఇటు దాంపత్య బంధాన్ని సమన్వయం చేస్తూ వస్తోంది అలియా భట్. అయితే ప్రస్తుతం అలియా భట్- రణబీర్ కపూర్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పేశారు. వాళ్లిద్దరూ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అలియా భట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అలియా భట్ ఆస్పత్రిలో స్కానింగ్ చేయించుకుంటుండగా.. పక్కనే రణబీర్ కపూర్ చూస్తూ కూర్చున్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ పిక్ తో పాటు రెండు సింహాలు, పక్కనే సింహం పిల్ల ఉన్న ఫొటోని కూడా షేర్ చేశారు. ఆ ఫొటోలకు ‘బేబీ కమింగ్ సూన్’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ప్రస్తుతం అలియా భట్- రణబీర్ కపూర్ తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సినిమాల విషయానికి వస్తే.. రణబీర్ కపూర్- అలియా భట్ కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, నాగార్జున కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా మొత్తం మూడు భాగాల్లో రానున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మరి తర్వాతి రెండు పార్టుల్లో అలియా భట్ క్యారెక్టర్ కొనసాగుతుందా? లేక ఆమెకు వీలైనప్పుడే సినిమా తీయడం ప్రారంభిస్తారా అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. అలియా భట్- రణబీర్ కపూర్‌లకు కామెంట్స్ రూపంలో మీ శుభాకాంక్షలను తెలియజేయండి.