Ajith: తమిళనాట అజిత్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనంటే అభిమానులు పడిచచ్చిపోతారు. అజిత్ కోసం ఎంతి కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తారు. తాజాగా, అజిత్ ఫ్యాన్స్ పోలీసులకు చుక్కలు చూపించారు. తమ అభిమానంతో పోలీసుల మతులు పోగొట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అజిత్ మంచి రైఫిల్ షూటర్ అన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రతీ ఏటా తమిళనాడులో జరిగే రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొంటుంటారు. ఈ సారి కూడా 47వ తమిళనాడు రైఫిల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు.
ఇందు కోసం కోయంబత్తూరుకు వెళ్లారు. అక్కడ ప్రిలిమినరీ రౌండ్ అయిపోగానే తిరుచ్చికి చేరుకున్నారు. తిరుచ్చి రైఫిల్ క్లబ్‌లో రైఫిల్ షూటింగ్ జరుగుతోంది. రైఫిల్ క్లబ్‌లో తల ఉన్నాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చారు. ఆయన కోసం అరుస్తూ గోల గోల చేయసాగారు. విధుల్లో ఉన్న పోలీసులకు వారిని అదుపు చేయటం కుదరలేదు. విషయం తెలుసుకున్న డిప్యూటీ కమిషనర్ శ్రీదేవీ అక్కడికి చేరుకున్నారు. వారిని గోల చేయోద్దని వారించారు.
అయినా వాళ్లు పట్టించుకోలేదు. అప్పుడు ఆమె వారిని ‘‘ అజిత్ సార్‌ను చూస్తే ఇక్కడినుంచి వెళ్లిపోతారా?’’ అని అడిగారు. వాళ్లు సరేనన్నారు. ఆమె లోపలికి వెళ్లి ఇదే విషయాన్ని అజిత్‌కు చెప్పారు. అప్పుడు అజిత్ ఆమెతో ‘ ఎలాంటి సమస్యారాదు. మీరు చెప్పినట్లు నేను చేస్తాను. వేచి ఉండమన్నా ఉంటాను. నాకందులో ఎలాంటి సమస్యా లేదు. కానీ, వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడినుంచి పంపేయండి’ అని చెప్పారు.
దీంతో శ్రీదేవి, అజిత్‌ను బయటకు రమ్మని చెప్పారు. అజిత్ బయటకు వచ్చి ఓ 5 నిమిషాలు అభిమానులతో ఉన్నారు. ఐదు నిమిషాల తర్వాత అభిమానులు ఒక్కొక్కరిగా అక్కడినుంచి వెళ్లిపోసాగారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అజిత్ అక్కడినుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. మరి, పోలీసులకే చుక్కలు చూపించిన అజిత్ ఫ్యాన్స్ ప్రవర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
AK Meet Fans Once Again 🤩🔥#AjithKumar #AK61 pic.twitter.com/AGcSu48NS0
— AJITH FC MAYILADUTHURAI💫 (@AjithFC_MDT) July 27, 2022
Police speaking to the crowd which has come to see Ajith in Trichy..#PeoplesHeroAJITHKUMAR #AjithKumar #Thala pic.twitter.com/jkD2aSjynk
— Senthilkumar D (@senthil_sk19) July 27, 2022
Thank You Trichy 😎
~ This Is #AjithKumar & Our Fans 😇#PeoplesHeroAJITHKUMAR #AK61 pic.twitter.com/DIjdQ1LmeO
— 𝐒𝐀𝐌𝐑𝐀𝐓 𝐀𝐉𝐈𝐓𝐇 👑 (@SamratAjithFC) July 27, 2022
ఇవి కూడా చదవండి : స్టార్ హీరో సినిమా సెట్లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు దుర్మరణం