షూటింగ్ సమయాల్లో కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. సెట్స్ లో కొన్ని సార్లు షాట్ సర్క్యూట్స్ జరగడం వల్లనో.. లేదా మరే ఇతర కారణాల వల్లనో ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు లవ్ రంజన్ డైరెక్షన్లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్‌తో పాటు రాజశ్రీ ప్రొడక్షన్ చిత్రం సెట్లో భారీ అగ్రి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరొకరు గాయపడ్డారు. ముంబాయిలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలో ఉన్న చిత్రకూట్ మైదాన ప్రాంతంలో రెండు సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన సెట్స్ పక్క పక్కనే వేశారు. ఒకటి రాజశ్రీ ప్రొడక్షన్స్ చిత్రం షూటింగ్ కాగా.. మరోకటి రణ్‌బీర్- శ్రద్ధా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం. అనుకోకుండా ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి అశోక్ దూబే తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మరణించాడని ఆయన తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఇంజన్లతో మంటలార్పే ప్రయత్నం కొనసాగించారు. సాయంత్రం 4.30 గంటలకు మొదలైన మంటలు రాత్రి తొమ్మిదిన్నరకు అదుపులోకి వచ్చాయి. ఎనిమిది ఫైర్ ఇంజిన్లు, అయిదు నీటి జెట్టీలతో సిబ్బంది శ్రమించారు. తొలుత ఆ ప్రాంతంలోని ఒక దుకాణంలో మంటలు వచ్చినట్టు అధికారులు చెప్పినప్పటికీ, ఆ తర్వాత ఫిల్మ్ సెట్లో మంటలు చెలరేగినట్టు ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడినట్టు సమచారం లేదని అధికారులు చెప్పారు. ఇక ప్రమాద సమయంలో హీరోహీరోయిన్లు అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. #LuvRanjan movie set catch fire in Mumbai https://t.co/jN62L2BCc5 — Ashish Rajendra (@AshishR25503247) July 29, 2022 View this post on Instagram A post shared by Voompla (@voompla) ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. యువ నటుడు కన్నుమూత! ఇది చదవండి: జేమ్స్‌బాండ్ గా రామ్‌చరణ్..? హాలీవుడ్ రైటర్ ట్వీట్!