ఒకప్పుడు సెలబ్రిటీలను కలవాలన్నా.. చూడాలన్న.. వారితో మాట్లాడాలన్నా ఎంతో కష్టపడాల్సి వచ్చేది. వారి దగ్గర నుంచి ఓ చిన్న రిప్లై ఇచ్చినా సరే ఎంతో సంబరపడేవాళ్లం. అయితే సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాలు వెంటనే తెలిసిపోతున్నాయి. స్టార్స్ తమ అభిమానులకు నిత్యం అందుబాటులోకి ఉండటానికి సోషల్ మీడియా వారధిగా మారింది. ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన అప్‌డేట్స్, ఫోటోలు, పర్సనల్ విషయాల వంటివి షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు వాళ్లు చేసే పోస్ట్‌లు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అసలు వాస్తవమో కాదో తెలియాలంటే సమయం పడుతుంది. కానీ ఆలోపే ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఓ హీరోయిన్ చేసిన పని కూడా ఇలానే నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
హార్ట్ ఎటాక్ సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది అదా శర్మ. పూరి జగన్నాథ్, నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అదా శర్మ, ఆ తర్వాత ‘క్షణం’ తదితర సినిమాల్లో నటించింది. నటిగా మంచి మార్కులేయించుకుందిగానీ, పాపం లక్కు మాత్రం కలిసి రావడంలేదు. అయినా, పట్టువదలకుండా అవకాశాల కోసం ట్రై చేస్తూనే వుంది. అదా శర్మకి శరీరం విల్లులా వంగుతుంది. రబ్బరు బొమ్మలా శరీరాన్ని ఎలాక్కావాలంటే అలా వంచేయగలదు. సంప్రదాయ విద్యలు.. అంటే, మల్లకంబ లాంటివి అదా శర్మకి అదనపు ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. అందుకేనేమో, ఎప్పుడూ ఫిట్‌గా వుంటుంది.
అయితే ఇంత ప్రతిభ ఉన్నప్పటికి కూడా అదా శర్మకు లక్కు కలిసి రావడం లేదు. అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ పోటోలను షేర్ చేస్తూ.. ట్రెండింగ్‌లో ఉంటుంది. తాజాగా మరోసారి విభిన్నమైన ఫోటోలు షేర్ చేసి వార్తల్లో నిలిచింది అదా శర్మ. ఈ పిక్స్ చూసిన నెటిజనులు.. పాపం అదా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అని కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా ఈ బ్యూటీ ఆకులతో డిజైన్ చేసిన గౌను ధరించి ఫోటోషూట్ చేయించుకుంది. ఆ ఫొటోలను సోషల్ మీడియా షేర్ చేస్తూ.. ‘‘ప్రకృతి చాలా గొప్పది. మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉండనిస్తుంది. అన్ని జీవరాసులను స్వీకరించే శక్తి మానవులకే ఇచ్చింది’’ అని రాసుకొచ్చింది. ఇలా ప్రకృతి సంబంధిత ఫొటోలను షేర్ చేస్తూనే… కూరగాయల ధరల పెరుగుదలపై ఓ ఆసక్తి కరమైన ఫొటోను పంచుకుంది.
ధరల పెరుగుదల మూలంగా సంపాదన సరిపోవటం లేదన్న అర్థం వచ్చేలా కామెంట్ చేసింది. కటిక పేదరికం అనుభవిస్తూ.. కనీసం కూరగాయలు కూడా కొనలేని స్థితిలో ఉన్న ఓ నిరుపేద మహిళగా మారిపోయాను అంటూ పూర్ లుక్‌లో ఉన్న ఫొటో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.