ఆమె.. హీరోయిన్లకు తల్లిపాత్రలు చేసే నటి. చూస్తే మాత్రం అలా కనిపించదు. గ్లామర్ విషయంలో ఎంత పోటీ ఇస్తుందంటే.. తనని ఎవ్వరూ బీట్ చేయలేరు అనేంతలా ఉంటుంది. హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె.. తమిళంలో పలు సినిమాలు చేసింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత ఆమెకి అవకాశాలు వచ్చింది కూడా లేదు. ఇక చేసేదేం లేక.. మహేశ్ బాబు ‘బాబీ’ సినిమాతో సహాయనటిగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగు, తమిళం అనే తేడా లేకుండా ఫుల్ బిజీగా మారిపోయింది. ఆమెనే ప్రగతి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కరోనా కారణంగా లాక్ డౌన్ వల్ల సినీ పరిశ్రమలో చాలా మార్పులు జరిగాయి. షూటింగ్ లు లేక చాలామంది ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ టైమ్ ని బాగా ఉపయోగించుకున్న పర్సన్ ఎవరైనా ఉన్నారంటే.. నటి ప్రగతినే గుర్తొస్తుంది. జిమ్ లో వర్కౌట్స్, బుల్లెట్ బండి నడుపుతూ వీడియోలు, గ్లామరస్ ఫొటోలు.. ఇలా ఒకటేమిటి సోషల్ మీడియాని కరెక్ట్ వాడుకుని నెటిజన్స్ బాగా సుపరిచతమైపోయింది. అప్పటివరకు తల్లి, వదిన, అత్త, పిన్ని తదితర పాత్రల్లో ప్రగతిని చూసిన ప్రేక్షకులు.. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ చూసి షాకయ్యారు. ఈమెలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోయారు.
ప్రగతి మాత్రం ఇదే ఒరిజినల్ అని, సినిమాల్లో చేసేది నటన అని తేల్చి చెప్పింది. ఇక లాక్ డౌన్ తర్వాత ప్రగతికి మరిన్ని మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. వెండితెరపైనే కాకుండా టీవీ షోల్లోనూ కనిపిస్తూ ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేస్తోంది. తన పిల్లలతో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు షేర్ చేసే ప్రగతి.. ఈ మధ్య ‘డాటర్స్ డే’ సందర్భంగా కుమార్తె గీతతో ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది. గతంలో తన కూతురు గురించి పలు సందర్భాల్లో చెప్పిన ప్రగతి.. ఆమె తనకంటే ధైర్యవంతురాలని చెప్పింది. మరి తల్లికూతురి ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి. ఈ ఫొటోలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: మరో సారి డ్యాన్స్ వీడియోతో సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న ప్రగతి!