Nidhi Agarwal: ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది హైదరాబాద్ అమ్మాయి నిధి అగర్వాల్. ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళం, హిందీల్లోనూ సినిమాలు చేస్తోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఫొటో షూట్లను మాత్రం పక్కన పెట్టడం లేదు. నిధి తరచుగా హాట్ ఫొటో షూట్లు చేస్తూ కుర్రకారు మనసుల్ని కొల్లగొడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా గోల్డ్ డ్రెస్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. గోల్డ్, వైట్ కలిసిన ష్కట్లో కొంటెగా నవ్వుతూ ఫొటో షూట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, నిధి అగర్వాల్ ‘మున్నా మైఖల్’ అనే హిందీ సినిమాతో వెండి తెరపై అడుగుపెట్టారు. తెలుగులో సవ్యసాచి ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ చేశారు. ఈశ్వరన్‌తో తమిళంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం తెలుగులో ఓ క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరో వస్తున్న ‘‘ హరిహర వీరమల్లు’’లో హీరోయిన్గా చేస్తున్నారు. మరి, నిధి అగర్వాల్ గోల్డ్ డ్రెస్ ఫొటో షూట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Manchu Manoj And Bhuma Mounika: వీడియో: మంచు మనోజ్, భూమా మౌనిక రిలేషన్ పై గొనె ప్రకాశ్ సంచలన కామెంట్స్!