సెలబ్రిటీల మీద ట్రోలింగ్ అనేది నేటి కాలంలో సర్వ సాధారణంగా మారింది. కొన్ని రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్‌ని సైతం ట్రోల్ చేశారు. దీనిపై నటి కస్తూరి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..
సోషల్ మీడియా వినియోగం పెరిగాక సెలబ్రిటీలను ట్రోల్ చేయడం సర్వసాధారణం అయ్యింది. ప్రస్తుత కాలంలో ట్రోలింగ్ బారిన పడని సెలబ్రిటీలు లేరంటే అతిశయోక్తి కాదు. ఇక కొన్ని రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్‌ని సైతం ఇలానే ట్రోల్ చేశారు. ట్రిపుల్ ఆర్‌కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అక్కడి స్లాంగ్‌లో మాట్లాడారు. అమెరికా యాసలో జూనియర్ అదరగొట్టారు అంటూ పలువురు ప్రశంసించారు. ఇక జూనియర్ అమెరికన్ యాక్సెంట్ చూసి అక్కడి మీడియా ప్రతినిధి సైతం ఆశ్చర్యపోయారు. జూనియర్ యాక్సెంట్‌పై విదేశీయులు ప్రశంసలు కురిపిస్తే.. మన దగ్గర మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే జూనియర్ ఎన్టీఆర్ యాక్సెంట్‌పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. రెండు మూడు రోజులు దీనిపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఇక తాజాగా ఈ వివాదంపై నటి కస్తూరి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఓ యూట్యూబ్ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో కస్తూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎన్టీఆర్‌ని ట్రోల్ చేయడం పట్ల ఘాటుగా స్పందించింది కస్తూరి. ‘‘అమెరికా వాళ్లకి వాళ్ల స్లాంగ్‌లోనే మాట్లాడితేనే అర్థమవుతుంది.. మన ఇంగ్లీష్‌లో మాట్లాడితే వారికి అర్థం కాదు. అందుకే జూనియర్ అమెరికన్ యాక్సెంట్‌లో మాట్లాడాడు. ఆ విషయంలో ఎన్టీఆర్ చేసింది కరెక్ట్. కానీ మన దగ్గర మాత్రం చాలా మంది జూనియర్‌ది ఫేక్ యాక్సెంట్ అంటూ ట్రోల్ చేశారు. అది చాలా తప్పు. నేను కూడా అమెరికాలో ఉన్నాను, అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అమెరికా వాళ్లకి.. వాళ్లలాగా మాట్లాడితే అర్థమవుతుంది. నేను ఇక్కడ తెలుగులో నా తమిళ యాక్సెంట్‌లో మాట్లాడితే అర్థమవుతుందా, అర్థం కాదు కదా’’ అని చెప్పుకొచ్చింది కస్తూరి.
ఈ సందర్భంగా యాంకర్ మంచు లక్ష్మి ప్రస్తావన తీసుకొచ్చారు. మంచు లక్ష్మి కూడా అలాంటి యాసలో మాట్లాడుతుందని.. ఆమెని కూడా ట్రోల్ చేస్తారని తెలిపాడు. అయితే దీనికి నటి కస్తూరి ఇచ్చిన సమాధానం కాస్త షాకింగ్‌గా ఉంది. మంచు లక్ష్మి యాక్సెంట్‌పై స్పందిస్తూ.. నిజమైన ప్రయత్నానికి.. కావాలని చేసే ఫేక్ ప్రయత్నాని తేడా ఉంది కదా అన్నది. హైదరాబాద్‌కి వచ్చి అలాంటి స్లాంగ్‌లో మాట్లాడితే కచ్చితంగా ట్రోల్ చేస్తారని చెప్పింది. ఇక్కడ తెలుగే మాట్లాడొచ్చు కదా, తెలుగు కూడా అమెరికన్ యాక్సెంట్‌లో మాట్లాడటం ఎందుకు అంటూ మంచు లక్ష్మికి పరోక్షంగా చురకలంటించింది కస్తూరి. ఈ విషయంలో ఎన్టీఆర్‌ని, మంచు లక్ష్మితో పోల్చొద్దని సూచించింది కస్తూరి.
ప్రస్తుతం కస్తూరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచు లక్ష్మిని టార్గెట్ చేసుకుని కామెంట్ చేయడంతో.. ట్రోలర్స్ మరింత రెచ్చిపోతున్నారు. ఇక నటి కస్తూరి విషయానికి వస్తే.. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇటీవల `గాడ్ ఫాదర్`లోనూ నటించింది. ఇక తెలుగులో సీరియల్స్‌లో నటిస్తూ.. ప్రేక్షకులు అభిమానాన్ని సొంతం చేసుకుంది. మరి కస్తూరి చేసిన కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.