టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సురేఖ వాణి. తల్లి, అక్క, వదిన పాత్రలు చేస్తూ మంచి పేరు గుర్తింపు సంపాదించింది. ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె కుమార్తె సుప్రీత కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.. గతంలో టిక్ టాక్ వీడియోలు ఇప్పుడు ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ తనదైన శైలిలో ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ఉంటుంది. తాజాగా రెడ్ డ్రెస్స్ దిగిన ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం సుప్రీత పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా ఫాలోయింగ్ లో తల్లినే మించిపోయింది సుప్రీత. ఇంతవరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు.. కానీ ఫాలోయింగ్ బాగానే సంపాదించుకుంది. ఈ మధ్యే ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ లో కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా హీరోయిన్ లకు ఏమాత్రం తగ్గకుండా తన గ్లామర్ తో నెట్టింట క్రేజ్ సొంతం చేసుకుంది. సుప్రీత “వెళ్లిపో” అనే మ్యూజిక్ ఆల్బమ్ లో నటించింది. వాలెంటైన్స్ డే రోజున విడుదలైన ఈ వీడియో సాంగ్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మరొకవైపు నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదిక ఓ ఫోటో పంచుకుంది.
సూర్యకిరణల వెలుగులో రెడ్ డ్రెస్స్ లో ఆకట్టుకుంది. సుప్రీత తన హాట్ పిక్స్ కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు సుప్రీత తన అందంతో బాగా రెచ్చిపోతుందని తెగ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. మరి.. సుప్రీత తాజా పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.