మాస్ మహారాజ రవితేజ తాజాగా నటించిన చిత్రం రావణాసుర. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే రిలీజ్ కు ముందు రోజే ఈ సినిమాలోని ఓ వీడియో లీక్ అయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
గత కొంతకాలంగా ఇండస్ట్రీకి లీకుల వ్యవహారం తలనొప్పిగా మారుతున్న విషయం తెలిసిందే. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా.. విడుదలకు ముందే ఆ మూవీకి సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. గతంలో అత్తారింటికి దారేది, టాక్సీవాలా లాంటి మరికొన్ని చిత్రాలకు సంబంధించిన సన్నివేశాలు రిలీజ్ కు ముందు రోజే నెట్టింట్లో లీకై సంచలనం సృష్టించాయి. తాజాగా ఆ జాబితాలోకి చేరింది మాస్ మహారాజ రవితేజ నటించిన రావణాసుర చిత్రం. రవితేజ డైలాగ్ చెప్పిన ఓ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా రవితేజ నటించిన రావణాసుర చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. దాంతో ప్రేక్షకులు ఎంతో ఆశక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంనే రిలీజ్ కు ముందు రోజే ఈ సినిమాలోని ఓ డైలాగ్ సీన్ లీక్ కావడం సంచలనం సృష్టించింది. లీక్ అయిన వీడియోలో..”కంచం ముందుకు, మంచం ముందుకు ఆడపిల్లలు రా అనంగానే రావాలి. లేకపోతే నాకు మండుద్ది” అన్న డైలాగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
అయితే ఈ వీడియో ఎక్కడి నుంచి లీకైందో తెలియాల్సి ఉంది. అయితే మరికొంత మంది మాత్రం ఇది పబ్లిసిటీ స్టంట్ గా కొట్టిపారేస్తున్నారు. ఇక రవితేజ అమ్మాయిలపై దారుణమైన డైలాగ్ చెప్పడంతో.. హీరోపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ లీకేజిలు ఇండస్ట్రీకి ప్రమాదకరంగా మారుతున్నాయని, వాటిని అరికట్టకపోతే నిర్మాతలు నష్టపోతారని సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.