ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలే క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటారు అని అనుకుంటారు. కానీ గత కొంత కాలంగా మగాళ్లు కూడా తామూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాము అంటూ బహిరంగంగానే చెబుతున్నారు. తాజాగా మరో స్టార్ నటుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ మహిళ తనను వాడుకోవాలని చూసినట్లు చెప్పుకొచ్చాడు.
సినిమా ఇండస్ట్రీలో రాణించాలని ఎంతో మంది కలలు కని పరిశ్రమకు వస్తుంటారు. అయితే అందులో కొంత మంది మాత్రమే రాణిస్తారు. మరికొంత మంది మధ్యలోనే ఇండస్ట్రీని వదిలేస్తారు. ఇలా వదిలేయడానికి ఎన్నో కారణాలు ఉండోచ్చు. కానీ చాలా మంది చెప్పే కారణం మాత్రం ఒక్కటే.. క్యాస్టింగ్ కౌచ్. అయితే చాలా మంది అమ్మాయిలే క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటారు అని అనుకుంటారు. కానీ గత కొంత కాలంగా మగాళ్లు కూడా తామూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాము అంటూ బహిరంగంగానే చెబుతున్నారు. తాజాగా మరో స్టార్ నటుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ మహిళ తనను వాడుకోవాలని చూసినట్లు రేసుగుర్రం విలన్ రవి కిషన్ చెప్పుకొచ్చాడు.
రవి కిషన్.. రేసుగుర్రం సినిమాలో స్టైలిష్ విలన్ గా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. తాజాగా ఇచ్చి ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చాడు.”క్యాస్టింగ్ కౌచ్ అనేది సినిమా పరిశ్రమలో ఉంది. నేను దానిని ఎదుర్కొన్నాను. అయితే దాని నుంచి నేను తప్పించుకున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ మహిళ నన్ను రాత్రికి కాఫీ తాగడానికి రమ్మన్నది. ఆమె మాటలు నాకు పూర్తిగా అర్ధం అయ్యాయి. నేను వెంటనే నో చెప్పాను. ప్రస్తుతం ఆ మహిళ పెద్ద స్థాయిలో ఉంది” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు నటుడు రవి కిషన్.
అయితే అవకాశాల కోసం అడ్డదారులు తొక్కకూడదు, నిజాయితీగా ఉండాలని మా నాన్న చెప్పారు అంటూ చెప్పుకొచ్చాడు. సినిమాల్లోకి రావడం తన తండ్రికి ఇష్టం లేదని, తన తల్లి మాత్రం తనకు ఫుల్ సపోర్ట్ చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. కాగా భోజ్ పూరి ఇండస్ట్రీలో ఫేమస్ అయిన రవి కిషన్.. తర్వాత తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాను అని సంచలన స్టేట్ మెంట్ ఇచ్చిన రవి కిషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.