సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం. ఇటీవలే ఈ సినిమా రిలీజై ప్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి రకరకాల కారణాలు వినిపిస్తుంటే.. బిగ్ బాస్ ఫేమ్ ఆరోహి మాత్రం నాగ చైతన్య ఈ సినిమా ప్లాప్ కి కారణం అంటుంది.
ఒక సినిమా ప్లాప్ అవ్వడానికి చాలానే కారణాలుంటాయి. ఎంచుకున్న కథలో లోపాలు, అంచనాలను అందుకోలేకపోవడం, క్యాస్టింగ్, గ్రాఫిక్స్, సంగీతం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కానీ అనూహ్యంగా అభిమానులే సినిమా ప్లాప్ కి కారణం అంటే ఆశ్చర్యపోవాల్సిందే. బిగ్ బాస్ ఫేమ్ ఆరోహి రావ్ తాజాగా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. శాకుంతలం సినిమాకి నాగ చైతన్య అభిమానులే కారణం అంటుంది. మరి అక్కినేని అభిమానులు శాకుంతలం సినిమా ప్లాప్ అవ్వడానికి ఏం చేశారు? ఆరోహి ఎందుకు ఇలా చెప్పుకొచ్చింది.
గుణ శేఖర్ దర్శకత్వంలో సమంతా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం. ఇటీవలే ఈ సినిమా రిలీజై ప్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. ఎక్కడ కూడా ఈ సినిమా గురించి పాజిటీవ్ టాక్ రాకపోవడం విశేషం. నెగటివ్ రివ్యూలు, మిశ్రమ స్పందనతో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా గ్రాఫిక్స్ పేలవంగా ఉండడమే ఈ సినిమాకి పెద్ద మైనస్ గా మారింది. సమంతా కూడా ఈ సినిమాకి సూట్ అవ్వలేదనే వాదన కూడా వినిపించింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఆరోహి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి అక్కినేని అభిమానులే కారణమని తెలియజేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.
ఆరోహి మాట్లాడుతూ.. “శాకుంతలం చిత్రం కొంచెం లాగ్ ఉండడం నిజమే. పురాణాల గురించి తెలియని వారికి ఈ సినిమా పంచ తంత్రం కథలాగే కనిపిస్తుంది. ఈ చిత్రం ప్లాప్ అవ్వడానికి నాగ చైతన్య ఫ్యాన్స్ కూడా ఒక కారణం. సమంత నటన బాగాలేదని చెప్పిన వారు నాగ చైతన్య అభిమానులే. ఉన్నది తీశారు కాబట్టే ఈ సినిమా ప్లాప్ అయింది. కొంచెం ఫిక్షన్, మసాలా జోడిస్తే ఈ సినిమా హిట్ పడేది. ఇక అల్లు అర్హ గురించి మాట్లాడుతూ.. అర్హ బాగా చేసింది. కానీ అంత కంటే బాగా చేసే చైల్డ్ ఆర్టిస్టులు బయట అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ మంచి పేరు సంపాదించుకున్న ఆరోహి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.