చిత్ర పరిశ్రమలో నటీ, నటులు మీడియాకు క్షమాపణలు చెప్పడం సాధారణమే. మూవీ ప్రమోషన్స్ లో , ఈవెంట్స్ లో తమ నుంచి ఏదైన పొరపాటు జరిగితే వారు సారీ చెప్తారు. కొంత మంది హీరోలు మాత్రం తమ తప్పు లేకపోయినప్పటికీ సారీ చెబుతారు. అది వారి మంచితనం. ఈక్రమంలోనే తాజాగా ఓ బాలీవుడ్ హీరో మీడియాకు క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాగచైతన్య కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూలతో, ఈవెంట్స్ తో బిజీ బిజీగా ఉంటోంది.
ఇందులో భాగంగానే చెన్నైలో ఓ ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. అయితే అనుకోని కారణాలతో ఈ కార్యక్రమం ఆలస్యం అయింది. దాంతో తమిళ మీడియాకు ఆమిర్ ఖాన్ క్షమాపణలు చెప్పారు. ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ” ముందుగా అందరు క్షమించాలి. విమానం ఆలస్యం కావడంతో ఇక్కడికి రావడం లేట్ అయింది. అయినప్పటికీ మీరు ఇంత ఓపికతో కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉందని” ఆమిర్ అన్నారు. ఈ మూవీని రిలీజ్ చేస్తున్న డిస్టిబ్యూటర్స్ కు నా ధన్యవాదాలు. అలాగే లాల్ సింగ్ చడ్డా మూవీ అందరి హృదయాలను హత్తుకునేలా ఉంటుందని ఈ సందర్భంగా ఆమిర్ పేర్కొన్నాడు.
ఇప్పటికే ఈ సినిమా పై పలు విమర్శలు, వివాదాలు నడుస్తున్నాయి. లేడీ సుపర్ స్టార్ విజయశాంతి ఆమిర్ ఖాన్ పై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. అదీ కాక బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా అనే హ్యాష్ టాగ్ సైతం ట్రెండింగ్ లో నిలిచింది. దీంతో ఆమిర్ తన సినిమాను బాయ్ కాట్ చేయకండి అంటూ వేడుకున్నాడు. మరి ఇలాంటి టైమ్ లో ఆమిర్ ఖాన్ మీడియాకు క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.