ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగాలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఎకనామిస్ట్, ఐటీ, డేటా సైంటిస్ట్ వంటి పలు విభాగాల్లో భర్తీలు కోరుతూ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిగ్రీ, బీటెక్, పీజీ, పీజీ డిప్లోమా, బీ.ఎస్సి, ఎంబీఏ, ఎంసీఏ, ఎం.ఎస్.సి, సీఏ చేసిన అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. అర్హతను బట్టి 36 వేల నుంచి లక్ష పైగా జీతం వస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 17 లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు ఖాళీలు, వాటి వివరాలు, అర్హత ప్రమాణాలు ఏమిటో తెలుసుకోండి.