కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో నడుస్తున్న యునైటడ్ కమర్షియల్ బ్యాంక్ లిమిటెడ్ లో (యూసీఓ) సెక్యూరిటీ ఆఫీసర్ల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు శాఖల్లో భర్తీ కోరుతూ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిగ్రీ లేదా డిప్లోమా పూర్తి చేసిన వారికి సువర్ణావకాశం. ఆన్ లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన అభ్యర్థులకు ఆన్ లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికయిన వారికి దేశంలో ఉన్న యూసీఓ బ్యాంకు బ్రాంచుల్లో ఏదో ఒక బ్రాంచ్ లో పోస్టింగ్ ఇస్తారు. నెలకి 36 వేల నుంచి 60 వేల పైనే జీతం ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించింది.