Railway Jobs: ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలని ప్రతిఒక్కరు కోరుకుంటారు. అందుకోసం ఏళ్లతరబడి కష్టపడుతుంటారు. నోటిఫికేషన్ పడిందంటే చాలు, కుప్పలు తెప్పలుగా అప్లికేషన్లు వస్తుంటాయి. ఇందులో విజయం సాధించేవారు కొందరైతే.. మరో నోటిఫికేషన్ కోసం ఎదురుచూసేవారు మరికొందరు. పోస్టుల సంఖ్య భారీగా ఉన్నప్పుడు అందరి కళ్లు, ఆ నోటిఫికేషన్ పైనే ఉంటుంది. అదే పోస్టుల సంఖ్య తక్కువుగా ఉంటే.. అప్లై చేసే వారి సంఖ్య తక్కువుగా ఉంటుంది. ఇలాంటి సమయంలో జాబ్ కొట్టడం చాలా సులభం. అందువల్లనే.. తక్కువ పోస్టులైనా ఖాళీల వివరాలను మీ ముందుంచుతున్నాం..
రైల్వే స్కూల్‌లో 22 టీచర్ పోస్టుల భర్తీకి సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. నోటిఫికేషన్ ప్రకారం.. వాక్-ఇన్ ఇంటర్వ్యూలు అక్టోబర్ 4న ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.
మొత్తం ఖాళీలు : 22
విభాగాలు:
విద్యార్హతలు:
వయోపరిమితి: నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి 18 మరియు 65 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతభత్యాలు:
ఇంటర్వ్యూ వేదిక: మహారాష్ట్రలోని DRM కార్యాలయం (భుసావల్)