దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎస్బీఐ.. ఇటీవలే 5008 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7 నుంచి దరఖాస్తులను స్వీకరించడం మొదలుపెట్టిన ఎస్బీఐ సెప్టెంబర్ 27 ఆఖరి తేదీగా ప్రకటించింది. తాజాగా ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎస్బీఐ, సెంట్రల్ రిక్రూట్ మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1673 పీవో నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో పని చేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 1673 ( SC- 270, ST- 131, OBC- 464, EWS- 160, UR- 648)
అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
వయోపరిమితి: 01.04.2022 నాటికి 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు బేసిక్ పే రూ. 41,960/-
దరఖాస్తు ఫీజు: రూ. 750/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు లేదు)
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థులకు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 22/09/2022
దరఖాస్తుకు ఆఖరు తేదీ: 12/10/2022
ఆన్ లైన్ ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 22/09/2022
ఆన్ లైన్ ఫీజు చెల్లింపు ఆఖరి తేదీ: 12/10/2022